గుప్పెడంత మనసు నవంబరు 22 ఎపిసోడ్: మహేంద్ర అనుపమ అల్లరి చూసి మరిసిన రిషిధార, సరికొత్త శైలేంద్ర! (2024)

అన్వేషించండి

వీడియోలుషార్ట్ వీడియోవెబ్ స్టోరీస్ఫోటో గ్యాలరీమీ కంపాటిబిలిటీసినిమా రివ్యూఒపీనియన్

ఉపయోగకరమైన

ఐ యఫ్ యస్ సి కోడ్ ఫైండర్ పిన్ కోడ్ ఫైండర్ అనుకూలత కాలిక్యులేటర్ హోమ్ లోన్ ఈఎమ్ఐ కాలిక్యులేటర్ పర్సనల్ లోన్ ఈఎమ్ఐ కాలిక్యులేటర్ కార్ లోన్ ఈఎమ్ఐ కాలిక్యులేటర్

Advertisem*nt

గుప్పెడంత మనసు నవంబరు 22 ఎపిసోడ్: మహేంద్ర అనుపమ అల్లరి చూసి మరిసిన రిషిధార, సరికొత్త శైలేంద్ర! (1)

హోమ్ఎంటర్‌టైన్‌మెంట్‌టీవీGuppedantha Manasu November 22nd Episode: శైలేంద్రలో ఈ యాంగిల్ కూడా ఉందా - మహేంద్ర అనుపమ అల్లరి చూసి మరిసిన రిషిధార!

Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార మధ్య బంధం బలపడింది...మరోవైపు శైలేంద్ర కుట్రలు సాగుతూనే ఉన్నాయి..ఇంకోవైపు అనుపమ ఎంట్రీ ఇచ్చింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

By : ABP Desam, RAMA|Updated at : 22 Nov 2023 08:34 AM (IST)

గుప్పెడంత మనసు నవంబరు 22 ఎపిసోడ్: మహేంద్ర అనుపమ అల్లరి చూసి మరిసిన రిషిధార, సరికొత్త శైలేంద్ర! (2)

Guppedantha Manasu (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

Guppedantha Manasu November 22nd Episode (గుప్పెడంతమనసు నవంబరు 22 ఎపిసోడ్)

రిషి, మ‌హేంద్ర వ‌ల్లే జ‌గ‌తి చ‌నిపోయిందనే దేవయాని మాయమాటలు నమ్మేస్తుంది అనుపమ. మహేంద్రని-రిషిని కలిసి వారు బాధపడేలా మాట్లాడుతుంది. అనుప‌మ వేసిన నింద‌ల‌తో మ‌హేంద్ర హ‌ర్ట్ అవుతాడు. రూమ్ లో ఉన్న మహేంద్ర దగ్గరకు వెళ్లి..మీ ఫ్రెండ్ ని అవైయిడ్ చేయ‌డం బాగా లేద‌ని తండ్రిని అంటాడు. నేనెందుకు పారిపోతానని మహేంద్ర అంటే.. మరి పదండి ఆమెతో మాట్లాడుదాం అంటాడు. నేను ఆమెను ఫేస్ చేయలేను అనేస్తాడు.
రిషి: మరి పదండి..ఆమెను వెళ్లిపోమని చెబుతాం
మహేంద్ర: నేను అలా చెప్పలేను
రిషి:మీరు ఫ్రెండ్స్ అన్నారు..క్లోజ్ ఫ్రెండ్ ని ఇలా అవాయిడ్ చేస్తారా..మీరిలా చేస్తే ఆవిడ ఫీలవరా...ఇంతదూరం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే ఇలా వదిలేస్తారా
మహేంద్ర: తనతో మాట్లాడాలని ఉంది కానీ తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను
రిషి:ఇలా గ‌ట్టిగా మాట్లాడేవాళ్లు, నిల‌దీసేవాళ్లు లేక‌పోవ‌డంతోనే నేను అమ్మ‌కు దూర‌మ‌య్యాన‌ు. అమ్మ బ‌తికి ఉన్న‌ప్పుడే ఆమె మ‌న జీవితాల్లోకి వ‌స్తే ప‌రిస్థితులు వేరేలా ఉండేవి. మీరు నార్మల్ గా ఉండండి...ఆమె మాటల్లో అమ్మపై ప్రేమ కనిపిస్తోంది..మిమ్మల్ని కూడా చాలా అభిమానిస్తోంది...
రిషి మాటలకు రియలైజ్ అయిన మహేంద్ర..అనుపమతో మాట్లాడేందుకు సరే అంటాడు

Also Read: అనుపమ ప్రశ్నలకు రిషి, మహేంద్ర ఉక్కిరిబిక్కిరి - శైలేంద్రకి ధరణి బడితిపూజ!

కిచెన్లో కాఫీ కలుపుకుంటూ వసుధారతో మాట్లాడుతూనే ఎంక్వైరీ కొన‌సాగిస్తుంది అనుప‌మ‌. స్టూడెంట్‌గా కాలేజీలోకి అడుగుపెట్టి రిషిని లైన్‌లో పెట్టి ఇప్పుడు డీబీఎస్‌టీ కాలేజీకి వ‌సుధార‌ ఎండీ అయ్యింద‌ని వ‌సుధార గురించి దేవ‌యాని అన్న మాట‌లు గుర్తుచేసుకుంటుంది. నీ కంటే ముందు ఎండీ ప‌ద‌విలో ఎవ‌రు ఉండేవారు అని వ‌సుధార‌ను అడుగుతుంది అనుప‌మ‌. జ‌గ‌తి అని చెబుతుంది. ఆమె ప్లేస్‌ను నువ్వు భ‌ర్తీ చేశావా? అని మ‌రో ప్ర‌శ్న అడుగుతుంది అనుప‌మ‌.
వసు: జ‌గ‌తి మేడ‌మ్ ప్లేస్‌ను నేను భ‌ర్తీ చేయ‌లేన‌ు
అనుపమ: డ‌బ్బు హోదాల‌లో దేనికి ప్రాముఖ్య‌త‌నిస్తావ‌ు
వసు: ఆ రెండింటి కంటే ప్రేమ‌కే ప్రాముఖ్య‌త‌నిస్తాన‌ు...డ‌బ్బు మ‌నిషికి అవ‌స‌రం మాత్ర‌మే...హోదా అన్న‌ది మ‌నిషిలో ఉండే భావ‌న మాత్ర‌మేన‌ని వ‌సుధార చెబుతుంది.
అనుపమ: ఏది ఏమైనా నీకు తెలియ‌కుండానే నువ్వు ఏండీ అయ్యాన‌ని అంటావు అంతేనా
వసు: మీరు జ‌గ‌తి మేడ‌మ్ ఫ్రెండ్ అంటున్నారు. మేడ‌మ్ నాకు ఏంతో మీరు నాకు అంతే అని వ‌సుధార బ‌దులిస్తుంది.
వ‌సుధార చాలా తెలివైంద‌ని అనుప‌మ అనుకుంటుంది.
అనుప‌మ, మ‌హేంద్ర పోటీప‌డి ఒక‌రికి ఇష్ట‌మైన వంట‌కాల్ని మ‌రొక‌రు వ‌సుధార‌కు చెబుతారు. వాటిని సిద్ధం చేయ‌మ‌ని ఆమెతో అంటారు.

ALso Read:అనుపమను దారి మళ్లించే ప్రయత్నంలో దేవయాని, రిషిధార ఎలా చెక్ పెడతారు!

శైలేంద్ర డ్రామా
ధ‌ర‌ణి వంటగదిలో బిజీగా ఉంటుంది...నాటకంలో భాగంగా శైలేంద్ర ఆమె దగ్గరకు వెళ్లి డ్రామా స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఇలా క‌ష్ట‌ప‌డితే చూడ‌లేక‌పోతున్నాన‌నూ బాధ‌ప‌డ‌తాడు. పనిమనిషిని పెట్టనా అని అడుగుతాడు. అదంతా నటన అని తెలుసుకోలేకపోయిన ధరణి...ఎక్కువ ఫీలైపోతుంది. మొన్నటి వరకూ అంతా కష్టంగా అనిపించేది కానీ మీరు నాపై ప్రేమను చూపిస్తుంటే ఇవేమీ కష్టంగా అనిపించడం లేదంటుంది. శైలేంద్ర చేతిలో ఏదో ఉండడం చూసి ఏంటది అని అడుగుతుంది. ప్రేమగా నీకో గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పి చీర ఇస్తాడు. ఆ రేంజ్ లో ప్రేమను తట్టుకోలేక ధరణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మా ఆయనేంటి ఇలా గిఫ్ట్ తీసుకొచ్చాడని అనుకుంటున్నావా అని మళ్లీ డైలాగ్స్ స్టార్ట్ చేస్తాడు. ప్రేమ, మాయ, మబ్బులు అని ధరణిని నిండా ముంచే పనిలో పడ్డాడు..ధరణి మాత్రం ఇదంతా నిజమే అనుకుంటోంది.నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నా గుండె తట్టుకోలేదు..ఇంకా ముందు ముందు నిన్నింకా సంతోషంగా చూసుకుంటాను...మనస్ఫూర్తిగా చెబుతున్నాను..నువ్వు ఇక్కడున్నావ్ అని మరో నాలుగు డైలాగ్స్ వేస్తాడు.. థ్యాంక్స్ అని ధరణి అంటే..అంతేనా అని కొంటెగా అడుగుతాడు. కాఫీ ఇవ్వనా అంటే..ఈ టైమ్ లో ఏం కావాలో తెలియదా అని ...వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి వెళ్లిపోతాడు. ధరణి మాత్రం మురిసిపోతుంది...మా ఆయన మంచి మనిషిలా అయ్యేలా చూడు స్వామీ అనుకుంటుంది...

Also Read: ఈ 4 రాశులవారికి ఈరోజు అదిరింది, నవంబరు 22 రాశిఫలాలు

మరోవైపు అందరూ కలసి భోజనం చేస్తుంటారు..నేను వడ్డిస్తానని మహేంద్ర..అనుపమకి వడ్డిస్తాడు.. అనుపమ హ్యాపీగా ఫీలవుతుంది... అనుపమ-మహేంద్ర ఇద్దరూ కొసరి కొసరి వడ్డించుకోవడం చూసి రిషి-వసు మురిసిపోతారు. డైనింగ్ టేబుల్ దగ్గర మహేంద్ర-అనుపమ కాలేజ్ డేస్ లో ఉన్నట్టే బాగానే అల్లరి చేస్తారు. ఇద్దరూ కాలేజీ విషయాలు మాట్లాడుకుంటారు..జగతిని గుర్తుచేసుకుంటారు. ఇంతలో వసుధార... మేడం మీ హస్బెండ్ ఏం చేస్తారు, పిల్లలు ఎంతమంది అని అడుగుతుంది..అనుపమ ఒక్కసారిగా డల్ అయిపోతుంది...మహేంద్ర మాట్లాడుతున్నా సైలెంట్ గా ఉండిపోతాడు... ఏంటిది వసుధారా అని రిషి వసుని మందలిస్తాడు. భోజనం అయ్యాక ఐస్ క్రీం తీసుకొచ్చి ఇస్తాడు మహేంద్ర.నీకింకా నా ఇష్టాలు గుర్తున్నాయా అని అనుపమ అడిగితే..నేను ఏవీ మర్చిపోలేదు నువ్వే నన్ను అర్థంచేసుకోక తప్పుపడుతున్నావ్ అంటాడు. నాకు నిజాలు తెలియాలని అడుగుతున్నానంతే అంటుంది అనుపమ. ఆ తర్వాత అనుపమ బయలుదేరుతుంది..
అనుపమ: ఇంతకుముందు నువ్వు నన్ను ఓ క్వశ్చన్ అడిగావ్..నేను ఇప్పుడు దానికి సమాధానం చెబుతాను. నేను పెళ్లి చేసుకోలేదు.. ఒంటరిగానే ఉన్నాను..మీ మేడం పెళ్లి చేసుకుని ఒంటరిగా ఉంది..నేను పెళ్లిచేసుకోకుండా ఒంటరిగా ఉన్నాను..
అనుపమా...అని గట్టిగా అరిచిన మహేంద్ర..నువ్వు మళ్లీ రావద్దు అనేసి లోపలకు వెళ్లిపోతాడు...
రిషి: డాడ్ అలానే అంటారు మేడం..మీరు వస్తూ ఉండండి
అనుపమ: నువ్వు వద్దన్నా వస్తూనే ఉంటాను.నువ్వు అడిగావు కదా మీ అమ్మ బాధలోంచి డాడీని బయటకు తీసుకురమ్మని కచ్చితంగా ఆ పని చేస్తాను..అనేసి వెళ్లిపోతుంది...

Published at : 22 Nov 2023 08:34 AM (IST)

Tags :

Guppedantha Manasu Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedantha Manasu Today Guppedantha Manasu Today Episode In Telugu Guppedantha Manasu Serial November 22nd Episode 927

మరిన్ని చూడండి

Advertisem*nt

టాప్ హెడ్ లైన్స్

కరీంనగర్ Karimnagar పోలీసుల అత్యుత్సాహం, హనుమాన్ దీక్షలో ఉన్న స్వాములపై దౌర్జన్యం! బండి సంజయ్ ఆగ్రహం సినిమా బేబీ లీక్స్... సాయి రాజేష్ వెన్నుపోటుపై శిరిన్ శ్రీరామ్ బుక్! ఎలక్షన్ మాక్ డ్రిల్స్ - ప్రత్యేక అధికారులు - కౌంటింగ్‌కు పోలీసులు రెడీ సినిమా Rave Party: బెంగుళూరు రేవ్పార్టీపైవిష్ణు మంచు ట్వీట్... అప్పుడే హేమపై చర్యలు

Advertisem*nt

ట్రెండింగ్ వార్తలు

#Usman Khawaja#Datta Jayanti#Ranbir Kapoor#Alia Bhatt#Stock Market#Paytm layoff#Alexei Navalny#Coronavirus Cases#WFI President#Salaar#Dhunki#Weather Forecast Today#Australia vs Pakistan#DMK Dayanidhi Maran#MP Cabinet Expansion#Ustad Rashid Khan Health#SBI Clerk Exam Date#Sydney#IPL 2024#Bigg Boss 17 Episode#Petrol#Diesel#Gold#Silver

Advertisem*nt

గుప్పెడంత మనసు నవంబరు 22 ఎపిసోడ్: మహేంద్ర అనుపమ అల్లరి చూసి మరిసిన రిషిధార, సరికొత్త శైలేంద్ర! (7)

for smartphones
and tablets

గుప్పెడంత మనసు నవంబరు 22 ఎపిసోడ్: మహేంద్ర అనుపమ అల్లరి చూసి మరిసిన రిషిధార, సరికొత్త శైలేంద్ర! (8) గుప్పెడంత మనసు నవంబరు 22 ఎపిసోడ్: మహేంద్ర అనుపమ అల్లరి చూసి మరిసిన రిషిధార, సరికొత్త శైలేంద్ర! (9)

వీడియోలు

ఫోటో గ్యాలరీ

టీవీ 6 Photos జ్యోతిరాయ్ ఏ ఫోటోలు దిగినా.. ఈ ఫోజు కచ్చితంగా ఉండాల్సిందే అనుకుంటా
టీవీ 5 Photos పింక్ శారీలో ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్!
టీవీ 5 Photos ఫ్రెండ్స్ తో 'త్రినయని' నయని అల్లరి చూశారా

ట్రెండింగ్ ఒపీనియన్

గుప్పెడంత మనసు నవంబరు 22 ఎపిసోడ్: మహేంద్ర అనుపమ అల్లరి చూసి మరిసిన రిషిధార, సరికొత్త శైలేంద్ర! (23)

ABP Desam

అసలు ఆధ్యాత్మికత ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? - సద్గురు మాటల్లో!

Opinion

గుప్పెడంత మనసు నవంబరు 22 ఎపిసోడ్: మహేంద్ర అనుపమ అల్లరి చూసి మరిసిన రిషిధార, సరికొత్త శైలేంద్ర! (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Maia Crooks Jr

Last Updated:

Views: 6191

Rating: 4.2 / 5 (43 voted)

Reviews: 82% of readers found this page helpful

Author information

Name: Maia Crooks Jr

Birthday: 1997-09-21

Address: 93119 Joseph Street, Peggyfurt, NC 11582

Phone: +2983088926881

Job: Principal Design Liaison

Hobby: Web surfing, Skiing, role-playing games, Sketching, Polo, Sewing, Genealogy

Introduction: My name is Maia Crooks Jr, I am a homely, joyous, shiny, successful, hilarious, thoughtful, joyous person who loves writing and wants to share my knowledge and understanding with you.