Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (2024)

Guppedantha Manasu 2023 february 24 Episode: గత ఎపిసోడ్‌లో రిషి.. తన పెద్దమ్మ దేవయానికి.. ‘ఇంకోసారి వసుధార ఇంటికి వెళ్లొద్దు.. నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను’ అని గట్టిగా చెబుతాడు. మరోవైపు వసు కోసం ఇంటికి వెళ్లి.. పెన్ డ్రైవ్ వంకతో వసుని కలుస్తాడు. అప్పడే అదిరిపోయే రొమాంటిక్ సీన్ అభిమానుల్ని మెప్పిస్తుంది. మరోవైపు రిషి.. వసు చెబుతున్న క్లాస్ రూమ్‌కి కూడా వెళ్తాడు. వసు బోర్డ్ వైపు తిరిగినప్పుడు సైలెంట్‌గా వెళ్లి స్టూడెంట్స్ మధ్యలో కూర్చుంటాడు. క్లాస్ అయ్యే దాక వసు.. రిషిని చూస్తుంది కానీ తన భ్రమ అనుకుంటుంది. క్లాస్ అయ్యాక నిజంగానే రిషి ఉన్నాడని తెలిసి మాట్లాడటానికి వెళ్తుంది. ‘నా ఉంగరం నాకు ఇచ్చెయ్’ అంటాడు రిషి కోపంగా ‘నేను ఇవ్వను.. అవి మన పేర్లే కాదు.. మన ఆత్మలు.. అవి ఎలా కలిసి ఉన్నాయో మనం కూడా అలానే కలిసిపోవాలి. పోనీ ఇందులో Vని తీసేసి.. R ఉన్న ఉంగరం తీసుకుని వెళ్లండి’ అంటుంది వసు మెడలోని తాళిని బయటికి తీసి చూపిస్తూ. ‘నీ వైపు తప్పు జరిగింది.నాకు శిక్ష పడింది. ఎంత వరకూ కరెక్టో ఆలోచించు నువ్వే.. ’ అనేసి కోపంగా వెళ్లిపోతాడు. దాంతో వసుధార అక్కడే ఏడుస్తూ ఎమోషనల్ అవుతుంది.

రిషి కోపం..

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (1)

ఇక నేటి కథనంలో మహేంద్ర, జగతీలు రిషి రూమ్‌లో వెయిట్ చేస్తూ ఉంటారు. రిషి రావడం రావడమే వాళ్లని చూసి.. ‘ఇద్దరూ కలిసి వచ్చారంటే ఏదో పెద్ద విషయమే ఉంది.. ముందు మేటర్‌లోకి రండి’ అంటాడు. ‘అంతా అయిపోయింది కదా రిషి.. వసుధారని నువ్వు దూరం పెడుతున్నావ్ అనిపిస్తోంది.. అపార్థాలు తొలగిపోయాయి కదా.. ఇంకా తనని అలా దూరం పెట్టడం’ అంటూ మహేంద్ర మాట పూర్తికాకుండానే.. ‘డాడ్ తను చేసిన పని నాకు నచ్చలేదు.. అయినా మీరు కూడా నన్ను మోసం చేశారు కదా..’ అంటూ కోపంగా మాటలు అంటాడు.

అబ్బో ఇంత అర్థముందా?

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (2)

ఇక మహేంద్ర.. ‘మాదే తప్పు లేదు రిషి.. వసుధార చెప్పొద్దు అంది రిషి..’ అంటూ బతిమలాడుతున్నట్లుగా మాట్లాడతాడు. దాంతో రిషి.. ‘వసుధారను క్షమించలేకపోతున్నా.. అలా అని వదిలిపెట్టలేకపోతున్నా.. మీరు అనుకున్నదేం జరగదులే డాడ్’ అనేసి రిషి వెళ్లిపోతాడు. ‘జరగదులే అంటే ఏంటి జగతీ?’ అంటాడు మహేంద్ర అర్థం కానట్లుగా. ‘అంటే వసుధారని వదులుకోనని అర్థం మహేంద్ర’ అంటుంది జగతీ. ‘అబ్బో ఇంత అర్థముందా? మరి మనల్ని ఎప్పుడు క్షమిస్తాడో.. సరే పదా’ అంటాడు మహేంద్ర కాస్త నిరాశగా.

నేనేం వినలేదు..

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (3)

ఇక జగతీ, మహేంద్రలు ఆ గదిలోంచి బయటికి వచ్చేసరికి.. ఆ పక్కనే దేవయానికి చూసి షాక్ అవుతారు. ‘అక్కయ్యా ఎక్కువ సేపు అలా నిలబడితే కాళ్లు నొప్పి లేస్తాయి కదా.. పదండి వెళ్దాం’ అంటుంది జగతీ వెటకారంగా. ‘వదినగారు చాటుగా అంతా విన్నారు కదా.? రిషి మాట తీరులో ఏదో మార్పు వచ్చినట్లు మీకు.. మీకు అనిపించడం లేదా?’ అంటాడు మహేంద్ర కావాలనే నవ్వుతూ. ‘నేనేం వినలేదు.. నేను ఇప్పుడే వచ్చాను’ అంటూ కోపంగా తిప్పుకుంటూ వెళ్లిపోతాడు దేవయాని.

మిస్టర్ ఇగో కూల్ మెసేజ్..

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (4)

ఇక సీన్ కట్ చేస్తే.. రిషి, వసులు నైట్ పడుకునే ముందు కాసేపు చాటింగ్ చేసుకుంటారు. మాట మధ్యలో తలనొప్పిగా ఉంది అంటాడు రిషి. ‘అల్లం టీ తాగండి.. రెస్ట్ తీసుకోండి’ అంటుంది వసు. ‘సరే.. పడుకుంటాను.. ఉదయాన్నే కాల్ చేస్తానులే వసుధారా’ అంటూ మిస్టర్ ఇగో కూల్‌గానే మెసేజ్ చేసి పడుకుంటాడు. ఇక ఉదయాన్నే రిషి లేవకుండానే.. మహేంద్ర రిషి రూమ్‌కి వస్తాడు. రిషి.. రిషీ అంటూ పిలుస్తూ లేపే ప్రయత్నంలో రిషి ఒళ్లు కాలిపోతుందని గ్రహిస్తాడు.

దేవయాని బిల్డప్..

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (5)

ఇంతలో వసు కాల్ చేస్తే.. ‘రిషికి జ్వరం వచ్చిందమ్మా’ అంటాడు. దాంతో వసు వెంటనే పరుగుతీస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే.. డాక్టర్ వచ్చి చూసి.. టాబ్లెట్స్ ఇచ్చి వెళ్తాడు. దేవయాని.. రిషి పక్కనే కూర్చుని.. జగతీ, మహేంద్రలతో.. ‘రిషిని ఎవ్వరూ పట్టించుకోరు.. ఎడ్యుకేషన్ టూర్స్ అదీ ఇది అని రెస్ట్ లేకుండా చేశారు’ అంటూ తిడుతూ ఉంటుంది. ఇంతలో వసు పరుగున అక్కడికి వచ్చి.. ‘మేడమ్ ఇప్పుడు ఎలా ఉంది?’ అంటుంది జగతీతో. ‘బాగానే ఉంది వసు.. కూల్.‌. డాక్టర్ వచ్చి చూసి వెళ్లారులే’ అంటుంది జగతి.

వసు చురకలు..

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (6)

వెంటనే వసు.. దేవయానిని.. ‘మేడమ్ లేవండి.. మీరు లేవండి’ అంటూ లేపి అక్కడే కూర్చుని.. రిషి తలపై చేయి వేసి.. ‘అమ్మా ఇంకా ఒళ్లు కాలిపోతుంది’ అంటుంది. వెంటనే పరుగున వెళ్లి.. చిన్న బౌల్‌లో నీళ్లు క్లాత్ పట్టుకుని వచ్చి.. తడిగుడ్డను రిషి తలపై వేసి.. ‘మేడమ్ మీరు ఇదైనా చేయొచ్చు కదా..? మళ్లీ పెద్ద నేను అది చేశాను ఇది చేశాను అంటారు’ అంటుంది దేవయానిని వసు. మహేంద్ర నవ్వుకుంటాడు. దేవయాని రగిలిపోతుంది.

తోటికోడళ్ల పోరు మొదలు

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (7)

‘మేడమ్ మీరు వెళ్లండి రిషి సార్‌ని నేను చూసుకుంటాను’ అంటుంది వసు. ‘ఏంటి నువ్వు చూసుకుంటావా’ అంటుంది దేవయాని కోపంగా. ‘అవును చూసుకుంటాను.. నిజంగా రిషి సార్ మీద ప్రేమ ఉంటే.. జ్వరం తగ్గాలని ఉంటే వెళ్లండి’ అంటుంది వసుధార. ‘వదినగారు రండి.. మా వెనకాలే రండి’ అంటాడు మహేంద్ర. దాంతో దేవయాని కూడా జగతీ వాళ్లతో వెళ్లిపోతుంది. ఇక కిందకు వచ్చిన దేవయాని రెచ్చిపోతుంది. ‘అసలు ఏం అనుకుంటున్నావ్ జగతీ నువ్వు?’ అంటుంది దేవయాని. ‘ఏం అయ్యింది అక్కయ్యా’ అంటుంది జగతీ.

రెచ్చిపోయిన దేవయాని..

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (8)

‘ఏం అయ్యిందంటావేంటీ? పరాయి ఆడపిల్లకి కొడుకుని అప్పగించి రావడం ఏంటీ?’ అంటుంది దేవయాని. ‘వదినగారు వాళ్లిద్దరూ ఇష్టపడుతున్నారు.. రేపో మాపో పెళ్లి కూడా చేసుకుంటారు కదా’అంటాడు మహేంద్ర. దాంతో దేవయాని రెచ్చిపోతూ.. ‘అలా అని మీరు కోరుకుంటే కాదు.. నేను.. నేను కోరుకోవాలి. లేని ఆశలు పెట్టుకుని భ్రమ పడకండి మహేంద్ర.. ఇప్పటి కూడా నేను ఏదైనా చేయగలుగుతాను గుర్తు పెట్టుకోండి’ అంటుంది దేవయాని.

జగతీ సవాల్..

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (9)

‘అక్కయ్యా ఇప్పటి దాకా మీరు ఎన్ని చేసినా మేము నోరు మెదపలేదు.. అంతో ఇంతో మీ ముందు వాదించాను తప్పా మీ గురించి రిషికి చెప్పలేదు.. కానీ రిషి, వసుల బంధాన్ని విడగొట్టాలని చూస్తే మీకు మళ్లీ మళ్లీ చెబుతున్నాను అక్కయ్యా.. రిషి చిన్నప్పటి నుంచి మీరేం చేశారో.. ఇప్పటి దాకా రాజీవ్‌కి మీరు ఎన్నిసార్లు కాల్ చేశారో.. కాలేజ్ లెక్చరర్స్‌తో కలిసి ఏమేమి ప్లాన్స్ వేశారో అన్నీ చెప్పాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి’ అంటుంది జగతి.

ఒక్క సాంగ్‌తో..

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (10)

‘ఈ మధ్య మీకు నేనంటే భయం భక్తి పోయింది.. ఏమైనా అంటే బెదిరిస్తున్నారు.. నన్ను రిషిని విడదియ్యాలని చూస్తున్నారు.. అది చూస్తాను’ అంటూ దేవయాని కోపంగా వెళ్లిపోతుంది. ఇక రిషి గదిలో ఉన్న వసు.. రిషికి సేవలు చేస్తుంది. ఇక సినిమాల్లో వచ్చినట్లుగా.. ఒక్క పాటలో రిషి జ్వరం తగ్గించేస్తుంది వసు. బ్యాగ్రౌండ్‌లో సాంగ్ వస్తూ ఉంటుంది.. రాత్రంతా.. నిద్రలేకుండా రిషికి టాబ్లెట్స్ ఇస్తూ.. మధ్య మధ్యలో పాలు తాగిస్తూ.. తడిగుడ్డ వేస్తూ.. చాలా ప్రేమగా చూసుకుంటుంది వసు. ఇక మరునాడు తెల్లారే సరికి.. రిషి వసు చేయి పట్టుకుని నిద్రలోంచి లేస్తాడు. తన చేతుల్లో ఉన్న వసు చేతిని చూసి.. తల తిప్పి వసుని చూస్తాడు.

రిషి గుండెల్లో ప్రేమ..

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (11)

వసు అలా మంచానికి వాలి నిద్రపోతూ ఉంటుంది. రిషి పైకి లేవయడానికి ట్రై చేస్తాడు కానీ లేవలేక ఇబ్బంది పడుతుంటే.. వసుకి మెలుకువ వస్తుంది. ‘సార్ జాగ్రత్త’ అంటూ వెనుక పిల్లోస్ వేసి.. కూర్చోబెడుతుంది. ‘రాత్రి అంతా ఇక్కడే ఉన్నావా?’అంటాడు రిషి వసుతో. ‘మీకు ఇలా ఉంటే నేను అక్కడ ఎలా ఉండగలను సార్’ అంటుంది వసు ప్రేమగా. ‘థాంక్యూ వసుధార..’ అంటాడు రిషి ప్రేమగా. ‘మీరు నాకు థాంక్స్ చెబుతారేంటి సార్.. మీరు నేను ఒక్కటే కదా..’ అంటుంది వసు నవ్వుతూ.

కాఫీ తెస్తా..

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (12)

‘నేనేం మాట్లాడాలో నాకు తెలియట్లేదు వసుధార..’ అంటాడు రిషి. ‘మీరేం మాట్లాడకండి సార్.. మీరు నా పక్కనే ఉంటే చాలు.. నాకు కొండంత బలం..’ అంటుంది వసు. అప్పుడే దేవయాని, జగతీ, మహేంద్రలు లోపలికి వస్తారు. రిషి చేతుల్లోంచి వసు తన చేతిని తీసేసుకుంటుంది కంగారులో. ఇక వసు.. మహేంద్ర వాళ్లతో.. ‘సార్ జ్వరం తగ్గింది.. మీరు బ్రష్ చేయించండి.. నేను వెళ్లి కాఫీ తెస్తాను’ అంటూ లేస్తుంది. దేవయాని కోపంగా చూస్తుంటే.. ‘మీరేంటి మేడమ్ అలా చూస్తారు. మీకు కూడా కాఫీ తెస్తాను’ అంటూ వెళ్తుంది వసు. రగిలిపోతుంది దేవయాని. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది. (photo courtesy by star maa and disney+ hotstar)

Read Also: ‘గృహలక్ష్మి’ ఫిబ్రవరి 24 ఎపిసోడ్: చెలరేగిన తులసి.. హాస్పటల్‌లో రాజ్యలక్ష్మికి చుక్కలు

Read Also: తులసి అల్లుడు.. దివ్యకి కాబోయే మొగుడొచ్చాడు.. పెళ్లి ఫిక్స్ చేసిన లాస్య

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (13)

రచయిత గురించి

శేఖర్ కుసుమ

శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

Guppedantha Manasu ఫిబ్రవరి 24: రాత్రంతా రిషితోనే వసు! బయటపడ్డ దేవయాని చాటు యవ్వారం.. దుమ్ములేపిన జగతి (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Golda Nolan II

Last Updated:

Views: 6181

Rating: 4.8 / 5 (78 voted)

Reviews: 93% of readers found this page helpful

Author information

Name: Golda Nolan II

Birthday: 1998-05-14

Address: Suite 369 9754 Roberts Pines, West Benitaburgh, NM 69180-7958

Phone: +522993866487

Job: Sales Executive

Hobby: Worldbuilding, Shopping, Quilting, Cooking, Homebrewing, Leather crafting, Pet

Introduction: My name is Golda Nolan II, I am a thoughtful, clever, cute, jolly, brave, powerful, splendid person who loves writing and wants to share my knowledge and understanding with you.