Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (2024)

Guppedantha Manasu serial ఉత్కంఠగా మారింది. Guppedantha Manasu 2023 february 09 Episode: గత ఎపిసోడ్‌లో రిషి, వసులను టూర్ పంపించేందుకు జగతీ, మహేంద్రలు బాగానే కష్టపడ్డారు. చివరికి పిల్లలకు కాలేజ్ తరపున కిట్స్ ఇవ్వడానికి వసు, రిషీలే బయలుదేరతారు. ఇక రిషి మనసులో ఎప్పటికప్పుడు.. ‘వసు మొగుడు ఎవరు?’ అనే విషయం తెలుసుకునే ఇన్ డైరెక్ట్ ప్రశ్నలు వేయడం.. వసు పిచ్చి సమాధానాలు ఇవ్వడం.. సాగుతూనే ఉంది. అయితే గత ఎపిసోడ్‌లో వసు కారు వెళ్తూ ఉండగానే.. కారులోనే కాఫీ ప్లాస్కో అందుకుని.. కప్పులో కాఫీ పోసుకుని తాగాలని ట్రై చేస్తుంది. అది చూసిన రిషి.. కావాలనే కుదుపులు, బ్రేక్స్‌తో వసుకి తాగే అవకాశమే ఇవ్వడు. దాంతో ‘సార్ మీరు కావాలనే నడుపుతున్నారు కదా?’ అంటుంది. ‘రోడ్డు మీద గుంతలు నేను చేశానా? ఆగు.. కారు పక్కకు ఆపుతా, ఇద్దరం కలిపి తాగుదాం’ అంటాడు రిషి. సరే సార్ అంటుంది వసు. దిగేటప్పుడు వసు చేతిలో ప్లాస్కో, కాఫీ గ్లాస్ ఉండటంతో సీట్ బెల్ట్ తియ్యమని రిక్వస్ట్ చేస్తుంది రిషిని. కానీ రిషికి గత రొమాన్స్ గుర్తొచ్చి.. వసు చేతిలోని ప్లాస్కో, గ్లాస్ తనే తీసుకుని.. నువ్వే సీట్ బెల్ట్ తీసుకో అంటూ కారు దిగిపోతాడు.

మీరే నా ఎండీ గారు..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (1)

ఇక కారు ముందుకు వచ్చి.. కాఫీ తాగుతారు ఇద్దరూ. ‘కాఫీ బాగుంది’ అంటాడు రిషి. ‘ఇలా బయటికి వచ్చి కాఫీ తాగడం బాగుంది కదా సార్’ అంటుంది వసు. ‘నీతో ప్రతి క్షణం బాగుంటుంది వసుధారా.. కానీ ఈ ఆనందం ఎప్పటికీ ఉండదు కదా? ఎప్పటికీ ఇలా ఉండి ఉంటే బాగుండేది కాదు.. అసలు ఇలా జరగకుండా ఉండి ఉండాల్సింది’ అనుకుంటాడు రిషి మనసులో. ‘ఏంటి ఏండీ గారు ఏం ఆలోచిస్తున్నారు?’ అంటుంది వసు వెంటనే. ‘మాటిమాటికి అలా పిలవకు’ అంటాడు రిషి. ‘మీరే నా ఎండీ గారు. మై డార్లింగ్ గారు మీరే..’ నవ్వుకుంటుంది వసు మనసులో.

నేను ఎలా అర్థం చేసుకోవాలి?

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (2)

సీన్ కట్ చేస్తే.. వాళ్లు వెళ్లాల్సిన ఊరు చేరుకుని.. వసు, రిషీలు పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. ‘అందరికీ నమస్కారం మేము ఈ ఊరు ఎందుకొచ్చామంటే.. పిల్లల భవిష్యత్ కోసం డీబీఎస్‌టీ కాలేజ్ ఒక ఆలోచన చేసింది.. ఆ ఆలోచన అమలు చేయడానికే మేమంతా వచ్చాం.. ఈయన పేరు రిషి సార్.. ఈయనే డీబీఎస్‌డీ కాలేజ్ ఏండీ.. (మై ఎండీ)’ అంటుంది వసు. ‘ఇదేంటి ఈ వసుధార ఇలా మాట్లాడుతుంది. తనను నేను ఎలా అర్థం చేసుకోవాలి’ అనుకుంటాడు రిషి మనసులో.

రిషి స్పీచ్..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (3)

‘మీ పిల్లల అందరినీ విధ్య కోసం మేము దత్తత తీసుకుంటున్నాం.. ఇక నుంచి పిల్లల చదువులు పూర్తి అయ్యే వరకూ డీబీఎస్‌డీ కాలేజే అన్ని రకాల ఫీజులు కడుతుంది.. ఈ కిట్స్ తీసుకుని.. అందరూ రిషి సార్‌కి థాంక్స్ చెప్పి వెళ్లండి’ అంటుంది వసు. ఆ తర్వాత రిషితో.. ‘రిషి సార్ మీరు మాట్లాడరా? ఈ మధ్య అసలు మాట్లాడటం లేదు’ అంటుంది వసు. వెంటనే రిషి జేబులో చేతులు పెట్టుకుని.. ‘మీ కోసమే మా కాలేజ్ మినిస్టరీ కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నాం.. మీకు ఏ సమస్య వచ్చినా.. కిట్‌లో ఉన్న నంబర్‌కి కాల్ చేయండి’ అంటాడు రిషి పిల్లలు.. పిల్లల తల్లిదండ్రులతో.

క్లారిటీ ఇచ్చిన ఎండీ..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (4)

‘ఇందాక వసుధార గారు నా గురించి చెప్పారు.. నేను కూడా తన గురించి చెప్పాలి. ఆవిడా చాలా గొప్ప వ్యక్తి... ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆవిడ చేసే పనులు కానీ.. ఆవిడ ఆలోచనలు కానీ మన ఊహకు కూడా అందవు.. నన్ను ఎండీ అన్నారు. డీబీఎస్‌డీ కాలేజ్‌కి ఎండీని. ఎండీ అంటే మ్యానేజింగ్ డైరెక్టర్ అని’ అంటూ క్లారిటీ ఇస్తాడు రిషి. ‘కాదు సార్.. ఎండీ అంటే మై డార్లింగ్’ అని అనుకుంటుంది వసు మనసులో. పిల్లలకు కిట్స్ పంచి ఇస్తాడు రిషి. అంతా థాంక్స్ చెప్పి వెళ్తారు. అందులో ఒక అమ్మాయి.. ‘థాంక్యూ సార్ మాకు అన్నీ ఇస్తున్నారు’ అంటుంది.

వసుకి చురకలు..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (5)

దొరికిందే ఛాన్స్ అనుకున్న రిషి.. తనని కావాలనే ఆపి.. ‘బాగా చదువుకో’ అనేసి.. కావాలనే.. ‘వసుధార మేడమ్‌లా నువ్వు యూనివర్సిటీ టాపర్ కావాలి.. ఆవిడలానే నువ్వూ అందనంత ఎత్తుకు ఎదగాలి’ అంటాడు రిషి. వసు నవ్వుకుంటుంది. ‘రిషి సార్‌కి నా మీద చాలా కోపంగా ఉన్నట్లుంది.. తెలిసీ తెలియకుండా తిడుతున్నారు అనిపిస్తోంది’ అనుకుంటుంది మనసులో. ‘సరే అందరికీ థాంక్యూ.. ఏమైనా ఉంటే ఈ ధర్మయ్య చూసుకుంటారు’ అంటూ పక్కనే ఉన్న ఓ వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడతాడు. దాంతో అంతా వెళ్లిపోతారు.

ధర్మయ్య రిక్వస్ట్..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (6)

ఆ ధర్మయ్య నవ్వుతూ.. ‘సార్ మా ఇంట్లో భోజనం చేసి వెళ్లండి సార్’ అంటాడు. ‘వద్దులే మీకెందుకు శ్రమ’ అంటాడు రిషి. ‘సార్ అంత దూరం నుంచి మాకోసం ఇంత చేయడానికి వస్తే.. మా ఇంట్లో చేయి కడక్కుండా ఎలా పంపిస్తాం? మేము తినేదే మీకు పెడతాం.. రండి సార్’ అంటాడు ధర్మయ్య. ‘సరే ధర్మయ్యా.. మీరు వెళ్లండి మేము వస్తాం’ అంటాడు రిషి. వెంటనే వసు.. బ్యాగ్‌లోంచి ఒక చాల్లెట్ తీసి.. ‘సార్ చాక్లెట్ తిందామా? అయ్యో ఒకే చాక్లెట్ ఉంది ఎలా?’ అంటుంది వసు దాన్ని పట్టుకుని.

గుర్తొచ్చిన జగతీ..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (7)

దాంతో రిషికి వసు ఇచ్చే కాకి ఎంగిలి గుర్తొస్తుంది. వెంటనే కూల్‌గా చాక్లెట్ అందుకుంటాడు. రిషినే కాకి ఎంగిలి చేసి ఇస్తాడేమో అనుకుంటుంది వసు. రిషి కూల్‌గా చాక్లెట్ తొక్క చించి.. లటుక్కున్న నోట్లే వేసుకుని ఇలా అంటాడు. బిత్తరచూపులు చూస్తుంది ఉండిపోతుంది వసు. ఇక సీన్ కట్ చేస్తే.. వసు, రిషీలు ధర్మయ్య ఇంట్లో భోజనానికి కూర్చుంటారు. ఆకు క్లీన్ చేసుకునే సమయంలో రిషికి జగతీ గుర్తొస్తుంది. (వనభోజనాల్లో ఆకు క్లీన్ చేసుకునే పద్దతిని నేర్పిస్తుంది జగతి.) ఇంతలో ధర్మయ్య భార్య కూరలు తెచ్చి పెడుతూ.. ‘లేట్ అయ్యిందని ఏం అనుకోమాకండమ్మా’ అంటుంది.

కొత్త దంపతులంటూ..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (8)

‘ఏం ఫర్లేదమ్మా..’ అంటుంది వసు నవ్వుతూ. ‘సార్ రాగి ముద్దా.. ఆకు కూర పులుసు భలే ఉంటుంది.. దాని మీద లైట్‌గా నెయ్యి వేసుకుంటే అబ్బా భలే ఉంటుంది’ అంటుంది వసు. వెంటనే రిషి దగ్గరకంటూ వెళ్లి.. ‘వసుధారా ప్లీజ్ రాగి ముద్దా వాటి లాభాలు అంటూ క్లాసు మొదలుపెట్టకు ప్లీజ్’ అంటాడు. సరే సార్ అంటుంది వసు. ఇక ఒక పచ్చిమిర్చి ఇచ్చి.. సార్ ఇది అంచుకుని తినండి అంటూ రిషికి అర్థమయ్యేలా చెబుతుంది. ‘మీరు రావడం మాకు చాలా సంతోషం సార్’ అంటాడు ధర్మయ్య. ‘మరే కొత్త దంపతులు.. చూడటానికి చిలకగోరింకల్లా ఉంటారు’ అంటుంది ధర్మయ్య భార్య. రిషి గుండెల్లో వీణలు మొగుతాయి.

ఇదిగో పెన్విటీ..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (9)

‘తినండి సార్’ అంటుంది వసు. ‘సార్ ఏంటమ్మా సారు.. కట్టుకున్నాయన్ని అలా పిలుస్తారా?’ అంటుంది ధర్మయ్య భార్య. ‘అంటే అదో పద్దతిలే లక్ష్మీ’ అంటాడు ధర్మయ్య నవ్వుతూ. ‘ఏమోలేమ్మా.. మేమైతేనా.. ఏమయ్యో.. ఏమండీ.. ఇదిగో పెన్విటీ..’ అంటాం. వెంటనే వసు రిషి పక్కకంటూ వచ్చి.. ‘ఏమయ్యా..’అంటుంది. తింటూ తింటూ ఆగిపోయిన రిషి.. ఆశ్చర్యంగా వసు వైపు చూస్తాడు. వెంటనే వసు తల తిప్పేసుకుని.. ‘ఏమండీ..ఇదిగో పెన్విటీ..’ అంటూ పిలిచి పిలిచి.. ‘ఈ పిలుపులు కూడా బాగున్నాయండి’ అంటుంది వసు నవ్వుతూ. పాపం రిషి తలదించుకుని తినడం మొదలుపెడతాడు.

రిషి కవరింగ్..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (10)

‘ఏమోనమ్మా మా ఇంట్లో అలానే అంటారు.. మీరు అలా అనరు కదా?’ అంటుంది ధర్మయ్య భార్య లక్ష్మీ. ఇక ధర్మయ్య.. ‘సార్ మీరు మాకు ఎంతో సాయం చేస్తున్నారు.. మేము మీ దంపతులకు బట్టలు పెడతాను కాదు అనకండి సార్’ అంటాడు. దాంతో రిషికి పొరమారి దగ్గు వస్తుంది. ‘ఏమైంది రిషి సార్’ అంటుంది వసు నవ్వుకుంటూ. ‘నిజానికి ఈ రోజు బట్టలు తీసుకోవద్దండి’ అంటాడు రిషి. ‘ఈ రోజు మంచిదే కదా సార్’ అంటాడు ధర్మయ్య. ‘అంటే నాకు మంచిది కాదనిమాట’ అంటాడు రిషి. ‘అవునా అయితే సరే సార్’ అంటాడు ధర్మయ్య.

వచ్చే ఏడాదికి పాపో బాబో..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (11)

వెంటనే రిషి.. వసు దగ్గరకంటూ జరిగి.. ‘చెప్పొచ్చు కదా..మనం వైఫ్ అండ్ హజ్బెండ్ కాదని..’ అంటాడు రిషి. ‘మీరే చెప్పండి నాకేంటీ?’ అంటుంది వసు. ‘పొగరు..’ అని రగిలిపోతాడు రిషి. ఇక తిన్నా తర్వాత.. రిషి, వసులు ధర్మయ్య దంపతులకు థ్యాంక్యూ వెళ్లొస్తాం అని చెబుతారు. దాంతో ధర్మయ్య.. ‘మంచిది సార్.. మళ్లీ వచ్చే ఏడాదికి పాపతోనో బాబుతోనో మా ఇంటికి రావాలి’ అంటాడు. వసు సిగ్గుపడుతుంది. రిషి కవర్ చేసుకోవడానికి వెళ్లొస్తామండి అంటూ బయలుదేరతాడు.

రిషీ రివేంజ్..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (12)

వసు, రిషీలు కారులో తిరిగి ప్రయాణం మొదలుపెడతారు. రిషి ధర్మయ్య వాళ్లు అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ‘అమ్మో ఎండీ గారు కోపంగా ఉన్నారు.. మాట్లాడించకుండా నిద్రపోతే బెటర్ ఏమో’ అని వసు కావాలనే కళ్లుమూసుకుంటుంది. రిషి అప్పుడే తిరిగి చూసి.. ‘నిద్రపోతుందేంటీ? నన్ను ఇంతలా బాధపెట్టి ప్రశాంతంగా ఎలా ఉంటుంది తను? పైగా నిద్రపోతుంది ఏంటీ? నన్ను డ్రైవర్ అనుకుంటుందా?’ అంటూ కావాలనే కారుని మలుపు తిప్పి బ్రేక్స్ వేస్తాడు. లటుక్కున్న కళ్లు తెరిచి.. వసు రిషివైపు చూస్తుంది.

నువ్వు విన్నావ్..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (13)

రిషి మాత్రం వసు లేవడం చూసుకోకుండా కారుని ఇష్టమొచ్చినట్లు నడుపుతూనే ఉంటుంది. వసు నోరు ఆవలించి మరీ కుదుపులకు అటు ఇటు తూగుతుంది. ‘ఏంటి సార్ ఈ డ్రైవింగ్’ అంటుంది వసు. ‘హా.. పోనీ నువ్వు నడుపు నేను పడుకుంటాను’ అంటాడు రిషి. ‘అర్థమైంది లెండీ.. నేను పడుకున్నానని కుళ్లు’ అనుకుంటుంది వసు. ‘రోడ్డు మీద గుంతలు ఉన్నాయి.. ఇప్పుడు నేనొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను.. అది నాకు ఎలా తెలుస్తుంది అంటావ్?’ అంటాడు రిషి. ‘ఏంటి సార్ ఏదో అంటున్నారు.. నాకేం వినిపించలేదు’ అంటుంది వసు. ‘నువ్వు విన్నావ్’ అంటాడు రిషి. ‘నిజమే సార్ నేనేం వినలేదు’ అంటుంది వసు.

మినిస్టర్ కాల్..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (14)

‘హో.. నా ప్రశ్నకు సమాధానం దొరికిందిలే.. పడుకో’ అంటాడు రిషి కోపంగా. ‘నేనేం పడుకోను లెండీ.. రోడ్డు బాలేకపోతే మీరేం చేస్తారు’ అంటుంది వసు. ‘కొన్ని బాగానే అర్థం చేసుకుంటావ్’ అంటాడు రిషి. ‘వసుధార పెళ్లి చేసుకుని మళ్లీ ఎందుకొచ్చావ్.. నువ్వు నా జీవితంలో లేవని బాధపడాలా? ఈ రకంగానైనా ఉన్నావని సంతోషపడాలా?’ అనుకుంటాడు మనసులో. ఇంతలో మినిస్టర్ వసుకి కాల్ చేస్తాడు. లిఫ్ట్ చేస్తుంది వసు. ‘అమ్మా వసుధారా ఎక్కడున్నారు?’ అంటాడు మినిస్టర్.

వీలైతే ఒకసారి ..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (15)

‘ప్రాజెక్ట్ టూర్‌కి వెళ్లి తిరిగి వస్తున్నాం సార్.. నేను మా ఎండీ(మై డార్లింగ్) గారు’ అంటుంది వసు రిషివైపు చూసి నవ్వుకుంటూ. రిషి రగిలిపోతాడు. ‘అవును గుడ్ అమ్మా.. వీలైతే ఒకసారి ఇటు వచ్చి వెళ్లండి’ అంటాడు మినిస్టర్. సరే సార్ వస్తాం అంటుంది వసు. ఫోన్ పెట్టేసిన వసు.. ‘మినిస్టర్ గారు రమ్మంటున్నారు’ అంటుంది. ‘అర్థమైంది’ అంటాడు రిషి కోపంగా. కారు మినిస్టర్ దగ్గరకు తిరుగుతుంది.

వసుకి గిఫ్ట్..

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (16)

ఇక మినిస్టర్ ముందు వసు, రిషీలు కూర్చుంటారు. ప్రాజెక్ట్ గురించి.. వాళ్ల పని తీరు గురించి వసు మొత్తం వివరిస్తూ ఉంటుంది. ఇంతలో మినిస్టర్ వసు మెడలోని తాళిని గమనించి.. తన పీఏకి ఏదో చెవిలో చెప్పి బయటికి పంపిస్తాడు. కాసేపటికి అతడు ఒక బాక్స్ పట్టుకుని వస్తాడు. వెంటనే మినిస్టర్.. అమ్మా వసుధారా .. ఇటు రా ఒకసారి.. అంటూ పిలిచి.. ‘నీకు పెళ్లి అయ్యిందన్న విషయం నాకు కొంచెం ఆలస్యంగా తెలిసింది.. తీసుకోమ్మా’ అంటాడు. వెంటనే రిషివైపు చూసిన మినిస్టర్.. ‘రిషీ ఇటు నా పక్కకు’ అని పిలిచి.. ఇద్దరూ ఆ బాక్స్‌ని పట్టుకుని.. వసుకి అందిస్తారు.

మీ వారేం చేస్తారు?

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (17)

ఆ బాక్స్‌లో అందమైన పట్టుచీర ఉంటుంది. దాన్ని చూసి.. అందుకున్న వసు.. ‘సార్ ఇది నా పెళ్లికి వచ్చిన అపురూపమైన కానుక.. పెద్దల మీరు గ్రేట్ రిషి సార్ చేతుల మీద ఇస్తున్న ఈ కానుక చాలా ప్రత్యేకం సార్’ అంటుంది నవ్వుతూ. ‘హా.. ఇంతకీ మీ వారు ఏం చేస్తారు?’ అంటాడు మినిస్టర్. ఇక రిషి చాలా ఆత్రంగా చెప్పు ఇప్పుడు సమాధానం అన్నట్లుగా చూస్తాడు. వెంటనే వసు నవ్వుతూ.. ‘మా వారు ఆల్ రౌండర్ సార్.. చాలా గొప్పవ్యక్తి’అంటుంది వసు. ‘గుడ్ ఒకసారి మీరిద్దరూ కలిసి మా ఇంటికి భోజనానికి రండి’ అంటాడు మినిస్టర్. ‘తప్పకుండా సార్.. రిషి సార్‌ని కూడా తీసుకుని వస్తాను’ అంటుంది వసు. ‘గుడ్.. అవునమ్మా రిషి సార్‌కి మీ వారిని పరిచయం చేశావా లేదా?’ అంటాడు మినిస్టర్. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది. (photo courtesy by star maa and disney+ hotstar)

Read Also:‘త్రినయని’ ఫిబ్రవరి 09 ఎపిసోడ్: గాయిత్రి చేతిలోనే నీ చావు.. తిలోత్తమలో చావు భయం.. విశాలక్షి హెచ్చరిక

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (18)

రచయిత గురించి

శేఖర్ కుసుమ

శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

Guppedantha Manasu ఫిబ్రవరి 09 ఎపిసోడ్: ‘ఇదిగో పెన్విటీ’ వసు పిలుపుతో రిషిలో కోటివీణలు.. వచ్చే ఏడాదికి పాపో బాబో.. (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Moshe Kshlerin

Last Updated:

Views: 6179

Rating: 4.7 / 5 (77 voted)

Reviews: 92% of readers found this page helpful

Author information

Name: Moshe Kshlerin

Birthday: 1994-01-25

Address: Suite 609 315 Lupita Unions, Ronnieburgh, MI 62697

Phone: +2424755286529

Job: District Education Designer

Hobby: Yoga, Gunsmithing, Singing, 3D printing, Nordic skating, Soapmaking, Juggling

Introduction: My name is Moshe Kshlerin, I am a gleaming, attractive, outstanding, pleasant, delightful, outstanding, famous person who loves writing and wants to share my knowledge and understanding with you.