Guppedantha Manasu ఫిబ్రవరి 27 ఎపిసోడ్: దేవయాని మనుషుల్ని ఏరి పారేస్తున్న రిషేంద్ర భూషణ్.. ‘ఒక్కదెబ్బకి రెండు పిట్టలు’ (2024)

Guppedantha Manasu 2023 february 27 Episode: గత ఎపిసోడ్‌లో వసు, దేవయానిల మధ్య చర్చ ఆసక్తికరంగా సాగింది. ‘నీ మెడలో తాళి ఏంటి? నువ్వు ఇప్పుడు రిషికి సేవలు చేయడం ఏంటీ? నీ తెగింపు ఏంటీ?’ అంటూ దేవయాని.. వసుపై రెచ్చిపోతే.. వసు కూల్‌గా.. ‘అన్నింటికీ సమాధానం ఈ తాళి పడటానికి కారణం అయినవాడే(రిషినే) సమాధానం ఇస్తాడు అని చెబుతుంది. దాంతో దేవయాని మరింత రగిలిపోతుంది. పైగా జగతీ, మహేంద్రలు కూడా దేవయానికి ఎదురు తిరగడం.. రిషి మాట వినకపోవడం అంతా దేవయానిలో కోపాన్ని పెంచి పోషిస్తున్నాయి. మరోవైపు.. రిషికి కాస్త జ్వరం తగ్గడంతో లేయి కూర్చుంటాడు. ఇంతలో జగతీ, మహేంద్రలు కూడా వస్తారు రూమ్‌లోకి. అక్కడే ఉన్న వసు.. ‘మెషిన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ప్రెస్ మీట్ ఉంది.. కానీ మీకు బాలేదు కాబట్టి.. దాన్ని వాయిదా వేస్తున్నా’ అంటుంది. ‘నేను లేకపోతే ఏమైంది.. మీరు చూసుకోండి’ అంటాడు రిషి. ‘కాదు సార్ దానికి సంబంధించి మనం చర్చించుకోవాలి’ అంటుంది వసు. నేను కొన్ని పాయింట్స్ చెబుతాను కదా.. తర్వాత అన్నీ నువ్వు చూసుకో.. నేను లేకపోయినా ప్రెస్ మీట్ ఆగొద్దు.. మినిస్టర్ గారు కూడా ఫీల్ అవుతారు’ అంటాడు రిషి. ఇక అప్పుడే దేవయాని.. ‘మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? రిషి పరిస్థితి ఏలా ఉంది? మీరేం మాట్లాడుతున్నారు’ అంటుంది కోపంగా. వచ్చి రిషి పక్కనే ఉన్న మహేంద్ర లేని నిలబడితే.. అక్కడే కూర్చుంటుంది. ‘నాన్నా రిషి.. నీకు బాలేదు. రెస్ట్ తీసుకోవాలి కదా నాన్నా’ అంటూ లేని ప్రేమను నటిస్తుంది.

పెద్దమ్మా వెళ్లు

Guppedantha Manasu ఫిబ్రవరి 27 ఎపిసోడ్: దేవయాని మనుషుల్ని ఏరి పారేస్తున్న రిషేంద్ర భూషణ్.. ‘ఒక్కదెబ్బకి రెండు పిట్టలు’ (1)

‘మెషిన్ ఎడ్యుకేషన్ ప్రెస్ మీట్’ అంటూ జగతీ, మహేంద్రలు ఏదో చెప్పబోతుంటే నోరు మూయిస్తుంది. దాంతో రిషి కూల్‌గా.. ‘పెద్దమ్మా ప్రెస్ మీట్ ఉంది. మేము చర్చించుకోవాలి.. ఇది చాలా అవసరం’ అంటూ సున్నితంగా చెబుతాడు. ‘పదా జగతీ మనం వెళ్దాం.. వాళ్లిద్దరూ చర్చించుకుంటారు’ అంటాడు మహేంద్ర. జగతీ అదే మాట అంటుంది. దేవయాని మాత్రం రిషి పక్క నుంచి లేవకపోయేసరికి.. ‘పెద్దమ్మా ప్లీజ్.. మేము చర్చించాలి ప్లీజ్’ అంటాడు రిషి ‘పెద్దమ్మా వెళ్లు’ అని చెప్పలే. దాంతో రగిలిపోతూ దేవయాని వెళ్లిపోతుంది. ఇక రిషి వసులు.. చాలా సేపు ప్రెస్ మీట్‌లో మాట్లాడాల్సిన అంశాలు గురించి చర్చించుకుంటారు. అది పూర్తికాగానే.. వసు లేచి.. ‘నేను వెళ్తాను సార్’ అంటుంది వసు.
‘వెళ్తావా’ అంటూ కాస్త బాధగా చూస్తాడు.

తప్పు తెలుసుకున్న వసు..

Guppedantha Manasu ఫిబ్రవరి 27 ఎపిసోడ్: దేవయాని మనుషుల్ని ఏరి పారేస్తున్న రిషేంద్ర భూషణ్.. ‘ఒక్కదెబ్బకి రెండు పిట్టలు’ (2)

అప్పుడే రిషి కన్ను వసు మెడలోని తాళి మీద పడుతుంది. దాంతో వసు దాన్ని డ్రెస్ వెనక్కి పెట్టుకుంటూ.. ‘కొన్ని విషయాల్లో తొందరి పాటు పనికి రాదని.. బంధాల్లో గోప్యత బాగుంటుందని అనిపిస్తోంది సార్.. ఈ విషయం తెలుసుకునే సరికి కొంత సమయం పట్టింది నాకు.. అయినా జరిగిన వాస్తవం మీకు తెలుసు.. ఈ బంధానికి బంధనాలు పడితే వాటిని మీరే తొలగించాలి సార్.. జరిగిన దాన్ని మీరు వివరిస్తేనే ప్రపంచానికి బహిర్గతం చేస్తేనే గౌరవంగా ఉంటుందేమో సార్.. మౌనంగా ఉన్నారేంటి సార్?’ అంటుంది వసు. ‘మౌనంగా కూడా మాట్లాడటమే వసుధార’ అంటాడు రిషి. ‘అర్థం చేసుకోగలిగితే చిక్కుముడిని అలవోకగా విప్పగలం సార్.. కోపం చిరాకుతో ఆలోచిస్తే చిక్కుముడి ఎప్పటికీ చిక్కు వీడదు సార్.. వస్తాను సార్’ అంటుంది వసు. ‘థాంక్స్.. వస్తాను అన్నందుకు’ అంటాడు రిషి.

తొందరపాటు నిర్ణయం..

Guppedantha Manasu ఫిబ్రవరి 27 ఎపిసోడ్: దేవయాని మనుషుల్ని ఏరి పారేస్తున్న రిషేంద్ర భూషణ్.. ‘ఒక్కదెబ్బకి రెండు పిట్టలు’ (3)

‘రావడానికి నేను ఎప్పుడో సిద్ధం సార్.. రావడానికి సమయం రావాలి. మీ అనుమతి కావాలి.. జాగ్రత్త సార్.. నేను ఇంటికి వెళ్లి కాలేజ్‌కి వెళ్తాను.. టైమ్‌కి తినండి.. నేను ధరణీ మేడమ్‌కి చెప్పి వెళ్తాను’ అంటుంది వసు. ‘ఎవరికీ చెప్పాల్సిన పనిలేదులే వసుధార’అంటాడు రిషి. ‘మీరు వద్దు అన్నా నేను చెప్పే వెళ్తాను. ఎందుకంటే మీరు నాకు ముఖ్యం కాబట్టి.. ఇంకెవరూ కాదు.. ఇంకేదీ కాదు..’ అనేసి వసు వెళ్లిపోతుంది. దాంతో రిషి మనసులో.. ‘వసుధార నువ్వు చేసిన తొందరపాటు నిర్ణయం.. మన జీవితాలకే అడ్డుతెరైంది.. అలా జరిగి ఉండాల్సింది కాదు.. జరిగిన దాన్ని తేలిగ్గా తీసి పారేయలేదు.. అలాగని నిన్ను క్షమించలేను.. కోపమో బాధో నేను బాధపడుతూనే నిన్ను బాధపెడుతున్నానా? ఏం అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నాను’ అనుకుంటాడు రిషి మనసులో.

వసు దబాయింపు..

Guppedantha Manasu ఫిబ్రవరి 27 ఎపిసోడ్: దేవయాని మనుషుల్ని ఏరి పారేస్తున్న రిషేంద్ర భూషణ్.. ‘ఒక్కదెబ్బకి రెండు పిట్టలు’ (4)

ఇక వసు ఇంటికి వెళ్లి కాలేజ్‌కి వచ్చేసరికి రిషి కారు కాలేజ్ ముందు ఉంటుంది. ‘రిషి సార్ వచ్చారా? ఇంత జ్వరంలో ఎందుకొచ్చారు.? కారు కానీ మహేంద్ర సార్ వేసుకొచ్చారా?’ అనుకుంటూ రిషి క్యాబిన్‌కి వెళ్లి చూస్తుంది వసు. రిషి ఏదో పనిలో నిమగ్నమై కనిపించడంతో వసు కోపంగా దగ్గరకు వెళ్లి.. ‘ఏంటి సార్ మీరు? లేవండి. నడవండి.. కారు మీద వెళ్లగలరా? డ్రైవర్‌ని పంపించనా.? జ్వరం వస్తే ఇలా కాలేజ్‌కి వచ్చేస్తారా? లేవండి’ అంటూ అరుస్తుంది. ‘హలో ఏంటి దబాయిస్తున్నావ్?’ అంటాడు రిషి. ‘నేను అంతే సార్.. మీకు ఎంత జ్వరం వచ్చిందో నాకు తెలుసు.. మీకు ఎలా ఉందో కూడా నేనే చెప్పాలి.. ప్రెస్ మీట్ అయ్యాక వెళ్తారా మరి’ అంటుంది వసు కోపంగా. ‘ఏమో వెళ్లాలనిపిస్తే వెళ్తాను’ అంటాడు రిషి. అదేంటి సార్ అలా అంటారు. .అంటూ మళ్లీ అరుస్తుంది. ‘హలో ఆపు.. వెళ్లు.. ప్రెస్ మీట్ పని చూడు’అంటాడు రిషి. దాంతో వసు అక్కడి నుంచి బయటికి వెళ్లి.. కాలేజ్ బాయ్‌ని పిలిచి.. ‘రిషి సార్ కారులో టాబ్లెట్స్ ఉంటాయి తీసుకునిరా’ అంటుంది.

లెక్చరర్స్ కన్ను..

Guppedantha Manasu ఫిబ్రవరి 27 ఎపిసోడ్: దేవయాని మనుషుల్ని ఏరి పారేస్తున్న రిషేంద్ర భూషణ్.. ‘ఒక్కదెబ్బకి రెండు పిట్టలు’ (5)

అది కాస్తా వసుని అవమానించే లెక్చరర్స్ చెవిన పడుతుంది. ‘చూశారా మేడమ్.. ఇప్పుడు దగ్గరుండి టాబ్లెట్స్ వేస్తుందేమో’ అనుకుంటూ వసుని ఫాలో అవుతారు చాటుగా. వసుకి టాబ్లెట్స్ బాక్స్ ఇచ్చి వెళ్తాడు ఆ వ్యక్తి. వెంటనే వసు.. అవి తీసుకుని.. రిషి దగ్గరకంటూ వెళ్లి.. ‘సార్ టాబ్లెట్స్ వేసుకునే టైమ్ అయ్యింది.. వేసుకోండి’ అంటూ టాబ్లెట్స్ తీసి.. రిషి చేతిలో పెట్టి వాటర్ బాటిల్ ఇస్తుంది. రిషి మారు మాట్లాడకుండా వేసుకుంటాడు. అది చాటుగా చూస్తున్న లెక్చరర్స్ షాక్ అవుతారు. కుళ్లుకుంటారు. అక్కడి నుంచి వెళ్లి వసు గురించి, రిషి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ‘చూశారా మేడమ్.. ఆ వసుధార స్టూడెంట్‌గా ఉండి.. మనల్ని మేడమ్ మేడమ్ అంటూ ప్రాజెక్ట్ హెడ్ అయిపోయింది. రిషి సార్ చేరదీశారు కాబట్టి తన ఆటలు ఆగుతున్నాయి..’ అంటుంది ఒక లెక్చరర్. ‘కాలేజ్ అనుకుంటుందో కాటేజ్ అనుకుంటుందో ఆ వసుధార.. రిషి సార్‌కి సేవలు చేస్తోందికదా.. అయినా వాళ్లకి ఆ స్పృహ ఎక్కడుంది?’ అంటుంది మరో లెక్చరర్.

రమ్మన్నారంట?

Guppedantha Manasu ఫిబ్రవరి 27 ఎపిసోడ్: దేవయాని మనుషుల్ని ఏరి పారేస్తున్న రిషేంద్ర భూషణ్.. ‘ఒక్కదెబ్బకి రెండు పిట్టలు’ (6)

‘ఏదో ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉంటారు కదా.. వసుధారకు పెళ్లి అయినా తనని రిషి సార్ ఎందుకు వదలడం లేదు? కాలేజ్‌కి తీసుకొచ్చి ఇంకా ఎందుకు నెత్తినపెట్టుకోవడం?’ అంటుంది మరో ఆమె. అంతా వినేస్తాడు రిషి. ‘ఎక్స్‌క్యూజ్‌మీ.. ఒకసారి మీరిద్దరూ నా క్యాబిన్‌కి రండి మేడమ్’ అనేసి వెళ్తూ వెళ్తూ.. ‘కాలేజ్ బాయ్‌కి జగతీ మేడమ్‌ని నా క్యాబిన్‌కి రమ్మని చెప్పు’ అనేసి వెళ్లిపోతాడు రిషి. ‘సార్ సార్ అది..’అంటూ లెక్చరర్స్ ఏదో చెప్పబోతుంటే.. ‘ఇక్కడేం మాట్లాడొద్దు మేడమ్.. క్యాబిన్‌లో మాట్లాడుకుందాం’ అనేసి రిషి వెళ్లిపోతాడు. ఇక జగతీ క్యాబిన్‌కి వెళ్తూ.. వెళ్తూ.. వసు ఎదురుపడితే.. ‘రిషి పిలిచాడట.. వెళ్తున్నా’ అంటుంది. సరే అంటుంది వసు. ఇక రిషి క్యాబిన్‌కి జగతీ వచ్చేసరికి.. రిషి కోపంగా తన సీట్‌లో కూర్చుని ఉంటాడు. ఆ లెక్చరర్స్ నిలబడి భయపడతూ ఉంటారు. జగతీ వచ్చి.. ‘రమ్మన్నారంట?’ అంటుంది. ‘కూర్చోండి’ అంటాడు రిషి. జగతి కూర్చుంటుంది.

వణికిన లెక్చరర్స్..

Guppedantha Manasu ఫిబ్రవరి 27 ఎపిసోడ్: దేవయాని మనుషుల్ని ఏరి పారేస్తున్న రిషేంద్ర భూషణ్.. ‘ఒక్కదెబ్బకి రెండు పిట్టలు’ (7)

‘వీళ్లు చేసిన తప్పుల లిష్ట్.. కాలేజ్‌లో వీళ్లు ప్రవర్తనకు సంబంధించిన రిపోర్ట్..’ అంటూ ఓ ఫైల్ జగతీకి ఇస్తాడు. ‘చాలా సార్లు మనుషులు మనస్తత్వాలు వేరుగా ఉంటాయి.. ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారని ఇప్పటి దాకా వెయిట్ చేశాను.. చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. వీళ్ల మాటల్ని నేనే స్వయంగా విన్నాను.. మేడమ్ వీళ్ల ఆలోచనలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్లకు అవసరం లేనివాటి కోసం మాట్లాడుకుంటున్నారు. పర్సనల్ విషయాల్లోకి వెళ్లారు. వసుధారతో పాటు నన్ను కూడా కలిపి వాళ్లకి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు’ అంటూ రిషి మొత్తం చెబుతాడు జగతికి. ‘సార్ మేము ఏదో అది..’అంటూ నసుగుతూ ఉంటుంది ఓ లెక్చరర్. ‘మేడమ్ మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు. మీ పద్దతి మీరైతే.. కాలేజ్‌కి కూడా కొన్ని పద్దతులు ఉంటాయి కదా? నేను మిమ్మల్ని ఏం అనుట్లేదు.. మీ ఇష్టమొచ్చినట్లు మీరు మాట్లాడితే.. మేము తీసుకునే నిర్ణయాలు మేము తీసుకుంటాం..’ అంటాడు రిషి. ‘కాదు సార్ వసుధార’ అంటూ ఏదో అనబోతుంది ఆ లెక్చరర్.

డిస్మిస్ చేస్తున్నాను..

Guppedantha Manasu ఫిబ్రవరి 27 ఎపిసోడ్: దేవయాని మనుషుల్ని ఏరి పారేస్తున్న రిషేంద్ర భూషణ్.. ‘ఒక్కదెబ్బకి రెండు పిట్టలు’ (8)

‘చూడండి మేడమ్.. ఇంతకముందు వసుధార గురించి మీరు మాట్లాడేదాన్ని నేను రెండుమూడు సార్లు సరిచేశాను.. పెద్దమ్మ దగ్గరకు తీసుకుని వెళ్లి మరీ చెప్పించాను. అయినా మీరు వినలేదు. మళ్లీ ఎప్పట్లా మాట్లాడుతున్నారు.. నోటీసులు ఇచ్చినా మీరు మారలేదు.. మీరు మారరని నాకు అర్థమైంది’ అంటాడు రిషి. ఇంతలో కాలేజ్ బాయ్ వచ్చి ఏవో పేపర్స్ ఇచ్చి వెళ్తాడు. పెన్ అందుకున్న రిషి.. ‘మేడమ్ మీకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేదంటే.. వేరే చోటకి వెళ్లండి.. అంతే కానీ అందరి పర్శనల్స్‌లోకి వెళ్లి నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు.. నేను మీకేం సలహాలు ఇవ్వను.. మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను’ అంటూ ఆ పేపర్స్ మీద సంతకం చేస్తాడు రిషి. వాళ్లు షాక్ అయిపోతారు. జగతీ కోపంగా వాళ్ల వైపు చూస్తూనే ఉంటుంది.

సారీ మేడమ్..

Guppedantha Manasu ఫిబ్రవరి 27 ఎపిసోడ్: దేవయాని మనుషుల్ని ఏరి పారేస్తున్న రిషేంద్ర భూషణ్.. ‘ఒక్కదెబ్బకి రెండు పిట్టలు’ (9)

‘మేడమ్ వీళ్లిద్దరినీ డిస్మిస్ చేశాను.. వెంటనే ఇవి నోటీస్ బోర్డ్‌లో పెట్టించండి.’ అంటూ రిషి ఆ పేపర్స్ జగతికి ఇస్తాడు. ‘మూడు నెలల శాలరీ అడ్వాన్స్‌గా ఇచ్చేయండి.. ఇంకేదైనా ఉంటే .. అది కూడా సెటిల్ చేసి పంపించేయండి’ అంటూ రిషి పైకి లేస్తాడు. ‘సార్ సార్.. ప్లీజ్.. సార్.. ఈ సారికి క్షమించేయండి సార్’ అంటూ వాళ్లు చాలా రిక్వస్ట్ చేస్తాడు. ‘మీరేదైనా మాట్లాడాలంటే జగతీ మేడమ్‌తో మాట్లాడుకోండి’ అనేసి రిషి వెళ్లిపోతాడు. దాంతో వాళ్లు జగతీ వైపు తిరిగి.. ‘మేడమ్ మీరే రక్షించాలి.. ప్లీజ్ మేడమ్ ప్లీజ్’ అంటూ రిక్వస్ట్ చేస్తుంది. ‘సారీ మేడమ్.. ఇది రిషి సార్ నిర్ణయం.. నేను కలుగజేసుకోను’ అంటుంది జగతి. ‘కాదు మేడమ్.. మేము ఏదో మాట్లాడుతుంటే రిషి సార్ వెనుక నుంచి విన్నారు మేడమ్’ అంటుంది ఆ లెక్చరర్. జగతీకి ఆ మాట ఇంకా కోపం తెప్పిస్తుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది. (photo courtesy by star maa and disney+ hotstar)

Read Also: ఇంటింటి గృహలక్ష్మి ఫిబ్రవరి 27 ఎపిసోడ్: విక్రమ్‌తో ఇంగ్లీష్ టీచర్ పాడుపని.. ఇదో పెద్ద కామపిశాచిలా ఉందే

Read Also: ‘జానకి కలగనలేదు’ ఫిబ్రవరి 27 ఎపిసోడ్:జ్ఞానాంబకి నిజం చెప్పేసిన డాక్టర్.. మీరు చనిపోతారు!

Guppedantha Manasu ఫిబ్రవరి 27 ఎపిసోడ్: దేవయాని మనుషుల్ని ఏరి పారేస్తున్న రిషేంద్ర భూషణ్.. ‘ఒక్కదెబ్బకి రెండు పిట్టలు’ (10)

రచయిత గురించి

శేఖర్ కుసుమ

శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

Guppedantha Manasu ఫిబ్రవరి 27 ఎపిసోడ్: దేవయాని మనుషుల్ని ఏరి పారేస్తున్న రిషేంద్ర భూషణ్.. ‘ఒక్కదెబ్బకి రెండు పిట్టలు’ (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Frankie Dare

Last Updated:

Views: 6171

Rating: 4.2 / 5 (73 voted)

Reviews: 88% of readers found this page helpful

Author information

Name: Frankie Dare

Birthday: 2000-01-27

Address: Suite 313 45115 Caridad Freeway, Port Barabaraville, MS 66713

Phone: +3769542039359

Job: Sales Manager

Hobby: Baton twirling, Stand-up comedy, Leather crafting, Rugby, tabletop games, Jigsaw puzzles, Air sports

Introduction: My name is Frankie Dare, I am a funny, beautiful, proud, fair, pleasant, cheerful, enthusiastic person who loves writing and wants to share my knowledge and understanding with you.