Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (2024)

Guppedantha Manasu 2023 february 03 Episode: వసు, రిషీ వేరువేరుగా గంగమ్మ తల్లి ముందు పడవలపై కోరికలు రాసుకోవడం.. వాటిని ప్రకృతికి మొక్కి నీట్లో వదిలిపెట్టడం.. ఆ తర్వాత ఒకరిని ఒకరు చూసుకుని.. మాట్లాడుకోవడం అంతా తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటికి చేరుకున్న రిషికి.. మెషిన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన మీటింగ్ పెట్టమని వసు మెసేజ్ చేయడం.. ఆ విషయం దేవయాని ముందే రిషి చెప్పడం.. ఆ మీటింగ్‌నే టార్గెట్ చేసి.. వసు పరువు తియ్యడానికి దేవయాని.. రాజీవ్‌తో కలిసి మరో స్కెచ్ వేయడం అంతా గత ఎపిసోడ్‌లో చూశాం. ‘కాలేజ్‌లో మీటింగ్ జరుగుతుంది. అక్కడికి నువ్వు వెళ్లి వసుధారా పరువు తియ్యాలి.. అప్పుడు తర్వాత కథను నేను నడుపుతాను’ అంటుంది రాజీవ్‌తో దేవయాని. ‘సరే మేడమ్.. నేను చూసుకుంటాను... సీన్ ఇచ్చారు కదా.. డైలాగ్స్.. స్క్రీన్ ప్లే.. అంతా నేను చూసుకుంటానులే’ అంటూ కూల్‌గా ఫోన్ పెట్టేసి.. వెంటనే కారు తీసుకుని కాలేజ్‌కి వెళ్తాడు రాజీవ్. అప్పటికే కాన్ఫరెన్స్ హాల్‌లో జగతీ, మహేంద్ర, ఫణేంద్ర, మిగిలిన మెషిన్ ఎడ్యుకేషన్ సభ్యులు అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. వసు ఇంకా మీటింగ్‌లో మాట్లాడే అంశాల గురించి తన క్యాబిన్‌లోనే ఏదో రాసుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రాజీవ్ ఆ హాల్లోకి వచ్చేస్తాడు ‘వసు వసు..’ అంటూ అరుస్తూ. షాక్ అయ్యి పైకి లేస్తారు మహేంద్ర, జగతీ, ఫణేంద్రలు.

తన కోసమే వచ్చానని మాట..

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (1)

‘బాగున్నారా మేడమ్.. బాగున్నారా సార్.. అందరూ బాగున్నారా? మీరు బాగుంటారు లెండీ.. ఎందకంటే మీరంతా మంచి వారే కదా.. అయినా మంచివారికి అంతా మంచే జరుగుతుంది. మా వసు.. నా భార్య కనిపించదేంటీ?’ అంటాడు రాజీవ్. ‘ఏంటి మహేంద్రా తను ఇక్కడికి వచ్చాడు?’ అంటుంది జగతి కంగారుగా. ‘అదే నాకు అర్థం కావట్లేదు జగతీ’ అంటాడు మహేంద్ర. ‘సారీ అందరూ నన్ను క్షమించాలి.. మీరేదో మీటింగ్‌లో ఉన్నట్లున్నారు.. అంతరాయానికి క్షమించండి. మీకు తెలియదు అనుకుంటా నేను ఎవరినో.. వసుధార నా భార్య.. నేను తన భర్తని.. తన కోసమే వచ్చానని మాట’ అంటాడు రాజీవ్. ఇక అక్కడున్న వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు.

వసుధార ఇతడ్ని పెళ్లి చేసుకుందా?

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (2)

‘చూడండి.. కొంచెం మర్యాదగా మాట్లాడు.. ఇలా డైరెక్ట్‌గా కాన్ఫరెన్స్ హాల్‌లోకి రావడం బాలేదు’ అంటాడు మహేంద్ర. వెంటనే రాజీవ్ నవ్వుతూ.. ‘కదా సార్.. కాన్ఫరెన్స్ డిస్ట్రబ్ అయితేనే మీకు ఇంత కోపం వస్తే.. కాపురం డిస్ట్రబ్ అయితే నాకు ఎంత కోపం రావాలి చెప్పండి’ అంటాడు. ఇక అక్కడే ఉన్న వసుని మాటలు అనే బ్యాచ్ గొనుక్కోవడం మొదలుపెడతారు. ‘వసుధార ఇతడ్ని పెళ్లి చేసుకుందా?’ అని ఒకామె.. ‘చూడటానికి రౌడీలా ఉన్నాడేంటో.. వదిలేసి వచ్చింది అంటున్నాడేంటీ?’ అని మరొకామె మాట్లాడుకుంటారు. ‘మరి రిషి సార్ కోసం ఇక్కడికి వచ్చేసింది కదా?’ అంటుంది మొదటి మాట్లాడిన ఆమె చిన్నగా.

నా భార్యని నాకు అప్పగించండి..

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (3)

‘చూడండి మీకు మీకు మధ్య ఏమైనా ఉంటే బయట చూసుకోండి. ఇక్కడికి వచ్చి ఇలా అరుస్తుంటే బాగుండదు చెబుతున్నాను’ అంటుంది జగతీ. ‘హ..హ.. మేడమ్ మేడమ్.. మీరు మీ పద్దతులు.. మీ ట్రైనింగ్ అన్నీ.. నాకు తెలుసు కదా.. ఎంతైనా మీరు చెక్కిన మా.. ఐ మీన్ నా భార్య’ అంటాడు రాజీవ్. ‘ఏదైనా ఉంటే బయట చూసుకో.. ఇక్కడ గొడవ చేయొద్దు’ అంటాడు మహేంద్ర కోపంగా. ‘సార్.. నా భార్య సార్ వసుధార.. నన్ను వదిలి కాలేజ్ రిషి సార్ అంటూ వచ్చేస్తే ఎలా ఉంటాను చెప్పండి.. నా బాధని కూడా కొంచెం అర్థం చేసుకోండి.. మీ అందరికి నమస్కారం చేస్తున్నా.. నా భార్యని నాకు అప్పగించండి.. కనీసం తను ఎక్కడుందో చెప్పండి చాలు’ అంటాడు రాజీవ్ నవ్వుతూ.

వసు.. ఎక్కడున్నావమ్మా..

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (4)

ఇంతలో రాజీవ్ అక్కడే ఉన్న వసుని ఆడిపోసుకునే లెక్చరర్‌ని చూస్తూ.. ‘మేడమ్ తనెక్కడుంది?’ అంటాడు. తన క్యాబిన్‌లో ఉండి ఉంటుంది. ఇప్పుడు మీటింగ్‌కి వస్తుంది’ అంటూ బదులిస్తుంది ఆమె. ‘అవునా థాంక్యూ మేడమ్.. థాంక్యూ మేడమ్.. పతికే ప్రత్యక్ష దైవం అంటారు కదా.. కానీ నేను పత్నినే ప్రత్యక్ష దైవం అంటారు.. అందుకే నేనే వెళ్తాను వసు కోసం’ అంటూ అక్కడి నుంచి వసు.. వసు.. అంటూ పిలుచుకుంటూ వెళ్లిపోతాడు. ‘మహేంద్రా ఏంటిది మళ్లీ పెద్ద గొడవ అయ్యేలా ఉంది’ అంటుంది జగతీ మహేంద్రతో. ‘వసు.. ఎక్కడున్నావమ్మా.. నీ రాజీవ్ వచ్చాడమ్మా ఎక్కడా? ఎక్కడమ్మా?’ అంటూ అరుస్తున్న రాజీవ్ మాటలు వసు చెవిన పడతాయి. ఇక జగతి, మహేంద్ర మిగిలిన వాళ్లంతా కంగారుగా రాజీవ్ వెనుకే వస్తూ ఉంటారు.

నోరుముయ్.. నేను నీతో ఎందుకు రావాలి?

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (5)

వసు క్యాబిన్‌లోంచి బయటికి వస్తుంది రాజీవ్‌కి ఎదురుగా వస్తుంది. ఇక్కడున్నావా.. ఎలా ఉన్నావ్ వసు’ అంటూ నవ్వుతాడు రాజీవ్. ‘ఇక్కడికి ఎందుకొచ్చావ్’ అంటుంది వసు కోపంగా. ‘నీ కోసం వసు’ అంటాడు రాజీవ్. ‘మర్యాదగా వెళ్లిపో’ అంటుంది వసు కోపంగా. ‘వెళ్లిపో కాదు వసు.. వెళ్లిపోదాం.. నిన్ను తీసుకుని వెళ్లడానికే వచ్చాను..’ అంటాడు రాజీవ్. ‘నేను రాను’ అంటుంది వసు. ‘నేను తీసుకుని వెళ్తాను కదా.. రాకపోతే మోసుకుని వెళ్తాను’ అంటాడు రాజీవ్. ‘నోరుముయ్.. నేను నీతో ఎందుకు రావాలి?’ అంటుంది వసు. ‘విన్నారా పెద్దల్లారా? ప్రక్షకుల్లారా? విన్నారా ఈ వింతా? నా పెళ్లాం నాతో రా అంటుంటే రాను అంటోంది.. ఎక్కడా ఉందా ఈ వింత’ అంటాడు రాజీవ్.

వదులు బావా.. చేయి వదులు..

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (6)

‘నోరుముయ్..’ అంటూ అరుస్తుంది వసు. ‘ఏంటి వసుధారా చిక్కిపోయావ్.. రంగు కూడా తగ్గావ్? నా మీదేమైనా బెంగ పెట్టుకున్నావా? పదా వెళ్దాం’ అంటూ వసు చేయి పట్టుకుని లాక్కుని వెళ్లే ప్రయత్నం చేస్తాడు రాజీవ్. ‘బావా వదులు.. చేయి వదులు.. పోలీసులకి ఫోన్ చేస్తాను’ అంటూ అరుస్తుంది వసు. ‘హ..హ.. వసూ.. ఇది మొగుడు పెళ్లాల అంతర్గత సమస్య.. నిన్ను ఎలా తీసుకుని వెళ్లాలో నాకు బాగా తెలుసు.. రా వసు.. రా’ అంటూ వసుని లాక్కుని వెళ్తుంటాడు. ‘వదులు బావా.. చేయి వదులు..’ అంటూనే ఉంటుంది వసు. కానీ రాజీవ్ వదలడు. కాలేజ్ బయటి వరకూ వసుని లాక్కుని వెళ్తూనే ఉంటాడు. జగతీ, మహేంద్ర, మిగిలినవాళ్లంతా వెనుకే వస్తూ ఉంటారు.

వసుధారా వెళ్లిపో ఇక్కడ నుంచి..

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (7)

ఇక సరిగ్గా కాస్త ముందుకు వచ్చేసరికి రిషి జేబులో చేతులు పెట్టుకుని ఎదురుగా నిలబడతాడు. వసు చేయి వదిలేస్తాడు రాజీవ్. వసు హ్యాపీ ఫీల్ అవుతుంది. ‘నమస్తే రిషి సార్ బాగున్నారా?’ అంటాడు రాజీవ్. ‘ఏం జరుగుతోంది’ అంటాడు రిషి. ‘ఓ భార్య ఓ భర్త.. మధ్యలో చిన్న తగాదా అంతే సార్.. మొగుడు పెళ్లాలు అన్నాక వంద ఉంటాయి కదా సార్.. తనని రమ్మంటుంటే రానంటోంది.. అది సార్ సంగతి’ అంటాడు రాజీవ్. ‘వసుధారా ఏంటి ఇదంతా? ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు.. వెళ్లిపో ఇక్కడ నుంచి ’ అంటాడు రిషి. ‘ఆహా.. మీరు సూపర్ సార్.. ఇలా చెప్పాలి సార్.. పెళ్లాం రాను అంటే మొగుడు పరువు మూసి నదిలో కలిసిపోదా.. రిషి సార్ వెళ్లమన్నారు కదా..’ అంటూ వసు చేయి పట్టుకోబోతాడు రాజీవ్.

సార్ నేను వెళ్లను..

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (8)

‘నేను రాను’ అంటూ రిషి వెనక్కి చేరుతుంది వసు. అంతా షాక్ అయ్యి చూస్తుంటారు. ‘ఏంటి వసుధారా.. ఇది తప్పు కదా.. రిషి సార్‌ని బ్లేమ్ చేయకు.. నువ్వు ఉండాల్సింది ఇక్కడ నా పక్కన.. ఆ పక్కన కాదు..’ అంటాడు రిషి. ‘సార్ చెప్పండి సార్ రాను అని’ అంటుంది వసు ఆవేదనగా. ‘వసుధార వెళ్లమంటున్నాను కదా.. ఏమైనా గొడవలు ఉంటే మీ ఇంట్లో చూసుకోండి’ అంటాడు రిషి. ‘సార్ నేను వెళ్లను అంటున్నాను కదా?’ అంటుంది వసు. ‘రిషి సార్ ప్లీజ్... నాకు పత్ని బిక్ష పెట్టండి.. నా భార్యని నాకు ఇప్పించండి సార్’ అంటాడు రాజీవ్. ‘వసుధారా ఇక్కడి నుంచి వెళ్లిపో..’ అంటాడు రాజీవ్. ‘నేను వెళ్లలేను సార్.. మీకు తెలియదు సార్’ అంటుంది వసు. ‘ఎందుకు వెళ్లవు.. నా భార్య అంటున్నాడు కదా?’ అంటాడు రిషి కోపంగా.

అంతా షాక్..

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (9)

‘ఇది సార్.. ఇది మాటంటే.. ఇదే పెద్దరికం అంటే.. ఎంతైనా మీరు జెంటిల్ మెన్ సార్.. ఇలా అడగండి’ అంటాడు రాజీవ్ కూల్‌గా. ‘వసుధారా నాకు కోపం తెప్పించొద్దు.. వెళ్లు’ అంటాడు రిషి. ‘సార్ నేను వెళ్లనని చెబుతున్నాను కదా సార్’ అంటుంది వసు. ‘హేయ్ ఏంటీ కాలేజ్‌లో పంచాయితీలు.. వెళ్లు వసుధారా’ అంటాడు రిషి ఆవేశంగా. ‘సార్ నా మాట వినండి సార్’ అంటుంది వసు. ‘చూడు వసుధారా రిషి సార్ పర్మీషన్ ఇచ్చారు.. వెళ్లిపోవచ్చు మనం.. పదా’ అంటూ వసు చేయి పట్టుకోబోతాడు రాజీవ్. అప్పుడే రాజీవ్ చేతిని ఆపుతాడు రిషి. బిత్తరపోతాడు రాజీవ్. వసు షాక్ అవుతుంది. అంతా షాక్ అవుతారు.

ఏరా ఆ అమ్మాయి నీకు పెళ్లామా..?

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (10)

‘రిషి సార్ ఈ ట్విస్ట్ ఏంటి సార్’ అంటాడు రాజీవ్. ‘ఈ ట్విస్ట్ ఇక్కడ కాదు.. అక్కడ’ అంటూ రాజీవ్‌ని ఒక్క తోపు తోస్తాడు రిషి. వెళ్లి పోలీస్ ముందు పడతాడు రాజీవ్. ‘ఏరా తప్పించుకుని తిరిగితే దొరకవని అనుకున్నావా? ఇక్కడికి వచ్చావని తెలిసి మేము వచ్చేదాకా ఆపమని రిషి సార్‌కి నేనే చెప్పాను’ అంటాడు ఆ పోలీస్. అంతా షాక్ అవుతారు. ‘ఏరా ఆ అమ్మాయి నీకు పెళ్లామా.. అసలు ఆ తాళి నువ్వు కట్టనే లేదు కదరా.. నీకు పెళ్లాం ఎలా అవుతుంది?’ అంటాడు పోలీస్ రాజీవ్ కాలర్ పట్టుకుని. ఆ మాటలకు రిషి, జగతీ, మహేంద్ర, అక్కడున్న వాళ్లంతా షాక్ అవుతారు. రిషి షాక్ అవుతూ వసు వైపు చూస్తాడు.

దేవయానికి క్లారిటీ..

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (11)

కానిస్టేబుల్స్ వీడ్ని తీసుకుని వెళ్లండి అని చెప్పిన ఎస్‌ఐ.. రిషి దగ్గరకు వచ్చి.. ‘సారీ సార్ ఆ రోజు పోలీస్ స్టేషన్‌లో చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ జరిగింది సారీ సార్.. వీడ్ని పట్టించడంలో సాయం చేసినందుకు థాంక్యూ అని చెప్పి ఎస్‌ఐ వెళ్లిపోతాడు. రిషి షాక్‌లోనే ఉంటాడు. మహేంద్రతో ‘వాళ్లిద్దరి(వసు, రిషీలను) అలా వదిలేసి.. అంతా వెళ్తే బెటర్’ అంటూ సలహా ఇస్తుంది జగతి. దాంతో మహేంద్ర అందరినీ పంపించేసి.. వసు, రిషీలను వదిలిపెట్టి వెళ్లిపోతారు. ఇక వసుని ఆడిపోసుకునే లెక్చరర్ ఒకామె.. దేవయానికి కాల్ చేసి.. ‘మేడమ్ కాలేజ్‌లో పెద్ద గొడవ జరిగింది’ అంటూ జరిగింది మొత్తం చెప్పేస్తుంది. షాక్ అయిన దేవయాని.. ‘వీడు దొరికిపోయాడు అంటే నా ప్లాన్ మార్చుకోవాలేమో’ అనుకుంటూ తలకొట్టుకుంటుంది.

ఆ తాళి రాజీవ్ కట్టాడనుకున్నాను..

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (12)

ఇక వసు ఓ చోట కోపంగా కూర్చుని ఉంటే.. రిషి వెళ్తాడు. రిషిని చూసి కోపంగా వసు వెళ్లిపోబోతుంది. ‘ఆగు వసుధారా.. నీ మెడలో ఆ తాళి’ అంటూ రిషి ఏదో మాట్లాడుబోతుంటే.. తన మాట వినకుండా అవమానించిన సందర్భాలు తలుచుకుంటుంది వసు. ‘మీకు ఆల్ రెడీ చెప్పాను సార్.. ఈ తాళి నా మనస్పూర్తిగానే నా మెడలో పడిందని..’ అంటుంది వసు. ‘ఆ తాళి రాజీవ్ కట్టాడనుకున్నాను కానీ ఇప్పుడు తను కాదు అని తెలిసింది.. ఏంటిది వసుధారా ఎవరిని మోసం చేస్తున్నావా? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? నన్ను మోసం చేస్తున్నావా?’ అంటాడు రిషి కోపంగా. ‘నేను ఎవరిని మోసం చెయ్యలేదు సార్’ అంటుంది వసు. ‘మరి దీన్ని ఏమంటారు? నీ గురించి నాకు తెలుసు.. తనుఎవరు?(తాళి కట్టింది ఎవరు?)’ అంటాడు రిషి.

మీకే అర్థమవుతుంది..

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (13)

‘మంచుగడ్డ ఎంత చల్లగా ఉన్నా ఇంత పెద్ద మంచు గడ్డని మోయడం కష్టం సార్.. మోసం చేస్తున్నా అన్నారు కదా.. నా గురించి అంతా తెలిసిన మీరు.. ఈ విషయం కూడా మీరే తెలుసుకోండి’ అనేసి వసు వెళ్లబోతుంది. ‘సమాధానం కావాలి వసుధార’ అంటాడు రిషి. ‘కాలమే సమాధానం చెబుతుంది సార్.. కాస్త ఆగండి’ అంటుంది వసు. ‘తప్పించుకోకు వసుధారా.. నీకు ఇందుకే కదా పొగరు అని పేరు పెట్టింది. నువ్వు ఏంటో నాకు అర్థం కావట్లేదు’ అంటాడు రిషి. ‘ఇందాకే కదా నాకు తెలుసు అన్నారు.. ఇప్పుడేమో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు.. అంటే సమస్య నాలో కాదు సార్ మీలోనే ఉంది.. ఆలోచించండి సార్ మీకే అర్థమవుతుంది’ అంటుంది వసు.

తప్పుడు మాటలు విని..

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (14)

‘తను ఎవరో నాకు తెలియాలి..’ అంటాడు రిషి. ‘తెలుసుకోండి.. కనీసం ఆ ప్రయత్నమైనా చేయండి’ అనేసి వసు వెళ్లిపోతుంది. ఇక జగతీ, మహేంద్రలు తలపట్టుకుంటారు. ‘కాలేజ్‌లో ఇంత గొడవ జరిగితేనే కానీ వసుధారా రాజీవ్‌ని పెళ్లి చేసుకోలేదని తెలియలేదు.. అసలు ఏం జరుగుతుంది జగతీ’ అంటూ ఉంటాడు మహేంద్ర. ఇంతలో ఆ గుమ్మం బయటే వసుని ఆడిపోసుకునే లెక్చరర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ‘మనం ఏదైనా అంటే అన్నాం అంటారు కానీ.. ఇంతకీ వసుధార అసలు మొగుడు ఎవరు?’ అంటుంది ఒకామె. టైటిల్ బాగుంది మేడమ్.. వసుధార మొగుడు ఎవడు? పేరుకి ఒక మొగుడు ఉంటాడు.. ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతుంది అంతే’ అంటూ తప్పుగా మాట్లాడుతుంది మరోఆమె. అంతా వింటున్న జగతీ తలపట్టుకుంటుంది.

వసుధారనే నిలదీద్దాం..

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (15)

‘అసలు కళ్లముందు జరిగిన దాని గురించి కూడా మాట్లాడుకోవడం తప్పేనా? అయినా రిషి సార్‌కి ఈ విషయంలో క్లారిటీ లేదో ఏమో’ అంటూ వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా వింటూ ఆవేశంగా పైకి లేవబోతుంది జగతి. మహేంద్ర జగతీని ఆపుతాడు. ‘ఆగు జగతీ.. ఇప్పుడు నువ్వు ఆవేశపడినంత మాత్రన్న ఉపయోగం లేదు. అసలు ఏం జరిగిందో వసుధారనే నిలదీద్దాం.. తనే మనకు సమాధానం ఇవ్వగలదు’ అంటాడు మహేంద్ర. ‘ఇప్పుడు ఈ విషయం కూడా రిషి తలకు చుట్టుకునేలా ఉంది మహేంద్రా.. దీన్ని రిషి ఎలా తట్టుకుంటాడు?’ అంటూ ఆవేదన చెందుతుంది జగతీ. మరి ఇద్దరూ కలిసి వసుని నిలదీయడానికి వెళ్తారో ఏమో. కచ్చితంగా వసుధార నిజం చెప్పదు. ఈ లోపు దేవయాని ఏదో ప్లాన్ చేస్తుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది. (photo courtesy by star మా and disney+ hotstar)

Read Also: ‘గృహలక్షి’ ఫిబ్రవరి 03 ఎపిసోడ్: గాయిత్రి కుట్రలో భాగమైన అభి.. నందు కేఫ్‌‌ని క్లోజ్ చేసే ప్లాన్

Read Also: బ్రహ్మముడి ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజ్‌తో కాళ్లు నొక్కించుకున్న స్వప్న.. ఆస్కార్ లెవల్లో కనకం కవరింగ్.. పాపం కావ్య!

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (16)

రచయిత గురించి

శేఖర్ కుసుమ

శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

Guppedantha Manasu ఫిబ్రవరి 03 ఎపిసోడ్: రాజీవ్ అరెస్ట్.. అనంతగిరి ఎస్‌ఐ ఎంట్రీతో నిజం బట్టబయలు!‘వసు వీడి భార్య కాదు’ (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Amb. Frankie Simonis

Last Updated:

Views: 6177

Rating: 4.6 / 5 (76 voted)

Reviews: 91% of readers found this page helpful

Author information

Name: Amb. Frankie Simonis

Birthday: 1998-02-19

Address: 64841 Delmar Isle, North Wiley, OR 74073

Phone: +17844167847676

Job: Forward IT Agent

Hobby: LARPing, Kitesurfing, Sewing, Digital arts, Sand art, Gardening, Dance

Introduction: My name is Amb. Frankie Simonis, I am a hilarious, enchanting, energetic, cooperative, innocent, cute, joyous person who loves writing and wants to share my knowledge and understanding with you.