Guppedantha Manasu మార్చి 16: పా..ఫం పెద్దమ్మ బిత్తరపోయిందిగా! రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ.. తలవంచిన కుటుంబం.. (2024)

Guppedantha Manasu 2023 March 16 Episode: గత ఎపిసోడ్‌లో దేవయాని గొప్ప స్కెచ్ వేసింది. ‘మీరు ఎవ్వరూ ఈ రోజు కాలేజ్‌కి వెళ్లడం లేదు.. కొత్తగా పెళ్లి అయిన జంట ఇంట్లో ఉంది కాబట్టి.. సత్యనారాయణస్వామి వ్రతం ఏర్పాటు చేశాను.. కాసేపట్లో పంతులు, ముత్తదువులు వస్తారు..’ అంటుంది. ఇక వసు, రిషీల గుండెల్లో గుబులు మొదలవుతుంది. భార్య భర్తలు కానీ వారితో భార్యభర్తల పూజ ఏంటీ? అన్నట్లుగా చూస్తారు జగతీ, మహేంద్రలు కూడా. ఇక పూజకు ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు.. జగతీకి నెమ్మదిగా మాయమాటలు చెప్పి.. ‘నీకు నాకు ఈ ఇంట్లో ఒకటే హక్కు జగతీ.. నేను ఎప్పుడూ అందరి సంతోషాన్నే కోరుకుంటాను... నన్ను ఊరికే గయ్యాలిలా చూడకండి’ అంటూనే.. ‘నాతో రా జగతీ’ అంటుంది దేవయాని. జగతీ వెళ్తుంది. ఇక జగతీ చేతుల్లో బట్టలు పెట్టి.. ‘వసు, రిషీలకు ఇవ్వండి జగతీ నువ్వు మహేంద్ర కలిసి. వ్రతంలో కొత్త జంట కూర్చుంటేనే అందం’ అంటుంది దేవయాని. జగతీ షాక్ అవుతుంది. అప్పటి దాకా దేవయాని మాటలు నమ్మిన జగతీ.. ‘ఇదా అక్కయ్యా మీ ప్లాన్.. వసు, రిషీలు ఇప్పటికే దూరంగా ఉన్నారు.. ఇప్పుడు ఎలా వాళ్లకి వీటిని ఇవ్వగలను?’ అనుకుంటుంది. ‘వెళ్లు జగతీ లేట్ అవుతుంది’ అంటూనే జగతీని పంపించి.. మనసులో.. ‘ఇప్పుడు చూస్తా వేడుక.. రిషి, వసుల మధ్య బంధం ఏపాటితో తేలిపోతుంది’ అనుకుంటుంది విలన్ దేవయాని.

​వసు ఆవేదన..

Guppedantha Manasu మార్చి 16: పా..ఫం పెద్దమ్మ బిత్తరపోయిందిగా! రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ.. తలవంచిన కుటుంబం.. (1)

ఇక జగతీ, మహేంద్రలు.. ‘ఇది మనకు తప్పదు.. ఇప్పుడు వెనకడుగు వేయలేం’ అని ఫిక్స్ అయ్యి.. ఆ బట్టల పట్టుకుని.. వసుధార రూమ్‌కి వస్తారు. వసు వాళ్లచేతుల్లో బట్టలు చూసి ఏంటివి అంటుంది. ‘నువ్వు రిషి కట్టుకుని.. వ్రతంలో కూర్చోవాలంట వసు’ అంటుంది జగతి. ‘మేడమ్ ఇది అయ్యేపనేనా? రిషి సార్ ఏం అంటున్నారో? ఏం అనుకుంటున్నారో మీకు తెలుసు.. పైకి నవ్వడం కానీ ఆ నవ్వుల్లో ఏదో చీకటి.. ఇప్పుడు ఇలా కూర్చోవాలి అంటే.. అంతంతమాత్రంగా ఉన్న మా మధ్య దూరం అమాంతం పెరిగిపోతుంది’ అంటుంది వసు ఆవేదనగా.

రిషి గదిలో వసు..

Guppedantha Manasu మార్చి 16: పా..ఫం పెద్దమ్మ బిత్తరపోయిందిగా! రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ.. తలవంచిన కుటుంబం.. (2)

‘వసు ఈ రకంగానైనా మీ మధ్య దూరం తగ్గుతుందని నువ్వు ఎందుకు అనుకోవు చెప్పు? వెనకడుగు వేయడం సరి కాదు కదా? రిషి ఒప్పుకోడని నువ్వు ఎలా అనుకుంటున్నావ్? ఏమో దేవయాని అక్కయ్య మీద ఉన్న గౌరవంతో కాదు అనడేమో.. ఇదో మంచి అవకాశంగా భావించు’ అంటూ ఒప్పిస్తుంది జగతి. ‘అవును వసుధార.. దేవయాని అక్కయ్యగారే ఇచ్చారని.. ఇమ్మన్నారని రిషికి చెప్పు.. ఏమో ఒప్పుకోవచ్చేమో’ అంటాడు మహేంద్ర. దాంతో వసు.. రిషి గదికి ఆ బట్టల పళ్లెం పట్టుకుని వెళ్తుంది. విషయం చెబుతుంది.

నీకేం అనిపిస్తుంది?

Guppedantha Manasu మార్చి 16: పా..ఫం పెద్దమ్మ బిత్తరపోయిందిగా! రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ.. తలవంచిన కుటుంబం.. (3)

‘ఇది నిజంగానే పెద్దమ్మగారి ఆలోచనేనా?’ అంటాడు రిషి. షాక్ అవుతుంది వసు. ‘సార్ మీరు ఏం అనుకుంటున్నారు? నేను ఇలా చేశాను అంటున్నారా?’ అంటుంది వసు కోపంగా. ‘వసుధారా మనం నిజంగానే భార్యభర్తలమేనా? దంపతులుగా పీటల మీద కూర్చోవడానికి అర్హత ఉన్నవాళ్లమేనా? అసలు నీకేం అనిపిస్తుంది?’ అంటూ నిలదీస్తాడు. తల దించుకుంటుంది వసు. ‘సమస్య ఇంకా సజీవంగానే ఉన్నట్లు కదా వసుధార..? నీ మౌనమే నాకు సమాధానం చెప్పింది’ అంటాడు రిషి.

అసలు గొడవ అయ్యిందా లేదా?

Guppedantha Manasu మార్చి 16: పా..ఫం పెద్దమ్మ బిత్తరపోయిందిగా! రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ.. తలవంచిన కుటుంబం.. (4)

ఇక కింద ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. పూజకు టైమ్ అవుతుంది పంతులు చెబుతూ ఉంటాడు. మహేంద్ర, జగతీలు కూడా రెడీ అయ్యి వచ్చేస్తారు. కొందరు ముత్తైదువులూ వచ్చేస్తారు. అంతా సిద్ధమే రిషి వసుధార ఎక్కడా అంటుంది దేవయాని. ఎంత సేపటికి రాకపోయేసరికి.. ‘గొడవ జరుగుతున్నట్లు ఉంది.. భలే భలే’ అన్నట్లుగా మనసులో నవ్వుకుంటుంది దేవయాని. ‘ధరణీ వెళ్లి పిలుచుకునిరా’ అంటూ పంపించబోతుంటే.. వసు, రిషీలు కిందకు దిగుతారు ఆ బట్టలు కట్టుకుని.. భార్యభర్తలుగా. అది చూసి దేవయాని షాక్ అవుతుంది. ‘అసలు గొడవ అయ్యిందా లేదా?’ అని రగిలిపోతుంది. జగతీ మహేంద్రలు సంబరపడిపోతారు.

రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ..

Guppedantha Manasu మార్చి 16: పా..ఫం పెద్దమ్మ బిత్తరపోయిందిగా! రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ.. తలవంచిన కుటుంబం.. (5)

ఇక రిషి.. వసులు వచ్చి మహేంద్ర జగతీల పక్కనే నిలబడతారు. ‘రండి నాన్నా వచ్చి కూర్చోండి’ అంటుంది దేవయాని. ‘మేము పీటల మీద కూర్చోవట్లేదు..’ అంటూ షాకిస్తాడు రిషి. ‘మరి?’ అంటుంది దేవయాని. ‘డాడ్ మీరు మేడమ్ కూర్చోండి’ అంటాడు రిషి. ‘రిషీ..?’ అంటాడు మహేంద్ర. ‘డాడ్ చెప్పింది వినండి.. మీరు మేడమ్ గారు కూర్చోండి’ అంటాడు రిషి. ‘వాళ్లిద్దరూ ఎందుకు కూర్చుంటారు? రిషీ ఏంటిది?’ అంటాడు దేవయాని. ‘పెద్దమ్మా ఈ విషయం గురించి తర్వాత మాట్లాడతాను.. డాడ్ మీరు కూర్చోండి’ అంటూ జగతీ, మహేంద్రలను కూర్చోబెడతాడు రిషి.

అసలు ఏం జరిగింది అంటే..

Guppedantha Manasu మార్చి 16: పా..ఫం పెద్దమ్మ బిత్తరపోయిందిగా! రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ.. తలవంచిన కుటుంబం.. (6)

‘దేవయాని మనకు వ్రతం ముఖ్యం.. వాళ్లు మరోసారి కూర్చుంటారులే కానీవ్వు’ అంటాడు ఫణేంద్ర. దాంతో దేవయాని కాస్త శాంతిస్తుంది. ‘పెద్దమ్మా వ్రతం కానివ్వండి.. మనం తర్వాత మాట్లాడుకుందాం’ అంటాడు రిషి. దాంతో కూల్‌గా వ్రతం మొదలైపోతుంది. ‘అసలు ఏం జరిగింది? ఇద్దరూ కూల్‌గా కనిపిస్తున్నారు? అసలు ఏం జరగలేదా?’ అంటూ దేవయాని మనసులో రగిలిపోతూ ఉంటుంది. వసు, రిషీలు బట్టలు మార్చుకోకముందు ఏం జరిగింది అన్నది.. గుర్తు చేసుకుంటాడు రిషి. అసలు ఏం జరిగింది అంటే.. రిషి ముందు వసు బట్టల పళ్లెంతో నిలబడి ఉండే సీన్ దగ్గరకు వెళ్లిపోతాడు రిషి. ఇప్పుడు అసలు ఏం జరిగిందో చూద్దాం.

ప్లాష్ బ్యాక్ స్టోరీ లెక్క.. జరిగిన సీన్‌ని గుర్తు చేసుకున్న రిషి

Guppedantha Manasu మార్చి 16: పా..ఫం పెద్దమ్మ బిత్తరపోయిందిగా! రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ.. తలవంచిన కుటుంబం.. (7)

రిషి కోపంగా.. ‘వసుధారా ప్రేమకు ఎవరు అవసరం లేదు.. రెండు మనసులుంటే చాలు.. కానీ పెళ్లికి రెండు కుటుంబాలు ఉండాలి.. ప్రేమకి సాంప్రదాయం అవసరం లేదు.. కానీ పెళ్లికి కావాలి.. నువ్వు ఒకటి అనుకున్నావ్.. ఒక పరిస్థితుల్లో మెడలో తాళి వేసుకున్నావ్.. నువ్వు ఒకటి నమ్మావ్.. ఆ నమ్మకాన్ని నేను గౌరవించాను.. అది నీ మీద మన ప్రేమ మీదున్న గౌరవంతోనే.. నమ్మకం నిలబెట్టడం ఇంత కష్టమా అనిపిస్తోంది. నమ్మకాన్ని గౌరవించడమే బాధపెడుతుంది కదా వసుధారా’ అంటాడు రిషి.

సార్ ఈ తాళి నా మెడలో..

Guppedantha Manasu మార్చి 16: పా..ఫం పెద్దమ్మ బిత్తరపోయిందిగా! రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ.. తలవంచిన కుటుంబం.. (8)

‘సార్ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు కదా?’ అంటుంది వసు. ‘అనుకోవాలి వసుధారా.. అదే కదా జీవితం. సమస్య నీది నాది అనే పరిధిని దాటి ఎక్కడికో వెళ్తోంది. ఎంత మందిని నమ్మిద్దాం. ఎంత మందికి అబద్దాన్ని నిజంగా చూపిద్దాం? ఆఖరికి దేవుడి పూజలో కూడా అయితే ఎలా?’ అంటాడు రిషి ఆవేదనగా. ‘సార్ ఈ తాళి నా మెడలో మనస్పూర్తిగా పడింది. ఈ విషయంలో మీకు నా మీద కోపం ఇగో అనిపిస్తే..’ అంటూ వసు మాట పూర్తి కాకుండానే... ‘వసుధారా నేను కోపంతో ఈ మాట చెప్పడం లేదు.. బాధతో చెబుతున్నాను. ఇగో ఎంత మాత్రం కాదు’అంటాడు రిషి.

వసు గుండె ముక్కలు..

Guppedantha Manasu మార్చి 16: పా..ఫం పెద్దమ్మ బిత్తరపోయిందిగా! రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ.. తలవంచిన కుటుంబం.. (9)

‘హా సార్.. ఇది దేవయాని మేడమ్ గారు ఇచ్చారు కదా?’ అంటుంది వసు బాధగా. ‘వసుధారా నేను పెద్దమ్మతో చెబుతాను..ఈ పూజ మనం చేయట్లేదు..’ అంటాడు రిషి కోపంగా. వసు గుండె ముక్కలైపోతుంది. నేటితో కథనం ముగిసింది. ఇంకేం అంటాడో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. మొత్తానికీ అది ప్లాష్ బ్యాక్‌లో జరిగిన సీన్. మొత్తానికీ దేవయానికి పెళ్లి అయ్యిందా లేదా అనే క్లారిటీ లేక అలా ఉంటుంది కానీ.. ఆమెకు కనుక క్లారిటీ వచ్చిందో.. ఆమె ఆడే ఆటకు వసుధార పని అయిపోతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. Guppedantha Manasu కొనసాగుతోంది. (photo courtesy by star maa and disney+ hotstar)

​Read also: ‘జానకీ కలగనలేదు’ మార్చి 16 ఎపిసోడ్: జానకి సౌభాగ్య వ్రతం గోవిందా.. అవమాన భారంతో జ్ఞానాంబ కన్నీళ్లు​​

Read Also: ‘గృహలక్ష్మి’ మార్చి 16 ఎపిసోడ్: తులసి నందు ఒకే మంచంపై.. గదిలోకి పంపిన లాస్య..ఇదేం దరిద్రం బాబోయ్

Guppedantha Manasu మార్చి 16: పా..ఫం పెద్దమ్మ బిత్తరపోయిందిగా! రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ.. తలవంచిన కుటుంబం.. (10)

రచయిత గురించి

శేఖర్ కుసుమ

శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

Guppedantha Manasu మార్చి 16: పా..ఫం పెద్దమ్మ బిత్తరపోయిందిగా! రిషీంద్ర భూషణ్ ఆజ్ఞ.. తలవంచిన కుటుంబం.. (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Nathanael Baumbach

Last Updated:

Views: 6175

Rating: 4.4 / 5 (75 voted)

Reviews: 90% of readers found this page helpful

Author information

Name: Nathanael Baumbach

Birthday: 1998-12-02

Address: Apt. 829 751 Glover View, West Orlando, IN 22436

Phone: +901025288581

Job: Internal IT Coordinator

Hobby: Gunsmithing, Motor sports, Flying, Skiing, Hooping, Lego building, Ice skating

Introduction: My name is Nathanael Baumbach, I am a fantastic, nice, victorious, brave, healthy, cute, glorious person who loves writing and wants to share my knowledge and understanding with you.