Guppedantha Manasu December 14th Episode: శైలేంద్ర చేతిలో బందీగా రిషి - భ‌ర్త కోసం త‌ల్ల‌డిల్లిన వ‌సు - దేవ‌యాని సంబ‌రం (2024)

Guppedantha Manasu December 14th Episode:భ‌ర్త రుషి ఎక్క‌డున్నాడో చెప్ప‌మ‌ని శైలేంద్ర‌ను బెదిరిస్తుంది వ‌సుధార‌. కానీ వ‌సుధార బెదిరింపుల‌కు శైలేంద్ర భ‌య‌ప‌డ‌డు. త‌న‌ను బెదిరించ‌డం కాకుండా వేడుకుంటే రిషి ఎక్క‌డున్నాడో చెబుతాన‌ని అంటాడు. భ‌ర్త క్షేమం కోసం వ‌సుధార త‌గ్గుతుంది. ప్లీజ్ సార్ ....రిషి ఎక్క‌డున్నాడో చెప్ప‌మ‌ని చేతులు జోడించి శైలేంద్ర‌ను వేడుకుంటుంది.రిషి ఎక్క‌డున్నాడో చెబితే నాకేంటి అని వ‌సుధార‌తో అంటాడు శైలేంద్ర. నాకు ఎండీ సీట్ కావాలి. సీట్ ఇస్తేనే రిషి ఎక్క‌డున్నాడో చెబుతాన‌ని త‌న మ‌న‌సులో ఉన్న అస‌లైన‌ కోరిక‌ను శైలేంద్ర బ‌య‌ట‌పెడ‌తాడు. అది నువ్వు బ్ర‌తికుండ‌గా జ‌ర‌గ‌ద‌ని శైలేంద్ర‌ను బెదిరిస్తుంది వ‌సుధార‌.

శైలేంద్ర ప్ర‌ళ‌యంలో...

జ‌గ‌తి పిన్ని కూడా త‌న కొడుకుకే ఎండీ సీట్‌ అప్ప‌గించాల‌ని చాలా కాపాడుకుంది. చివ‌ర‌కు శైలేంద్ర ప్ర‌ళ‌యంలో కొట్టుకుపోయింది. త‌న కొడుకు ప‌క్క‌న‌లేకుండాపోయింది. రేపు నీకు ఏమ‌న్నా అయితే రిషి ప‌క్క‌న ఎవ‌రుంటారు. నీకు కాక‌పోయిన రిషికి ఏమ‌న్న అయితే అంటూ వ‌సుధార‌ను బెదిరిస్తాడు శైలేంద్ర‌. /

నీకు అంత సీన్ లేదు...అలాంటి ఆలోచ‌న నీ మైండ్‌లోకి వ‌స్తే మీ కంటే ముందు ఆలోచ‌న‌ను చంపేస్తాన‌ని శైలేంద్ర‌కు ధీటుగా బ‌దులిస్తుంది వ‌సుధార‌. ప‌సుపు కుంకుమ‌లు కాపాడుకోవాల‌ని గ‌ట్టిగానే ఉన్నావ‌ని వ‌సుధార‌పై సెటైర్ వేస్తాడు శైలేంద్ర‌. నీ భ‌ర్త క్షేమం కోసం ఎండీ సీట్‌ను వ‌దిలిపెట్ట‌మ‌ని వ‌సుధార‌ను హెచ్చ‌రిస్తాడు శైలేంద్ర‌. ఎందుకు అవ‌న‌స‌రంగా ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటార‌ని అంటాడు.

ఎండీ సీట్ కోసం...

ఎండీ సీట్ కోసం ఎంత దూర‌మైన వెళ‌తాను. ఎంత‌మంది ప్రాణాల‌నైనా తీస్తాను. అస‌లు ప్రాణాలు తీయ‌డం నాకు ఇష్టం లేక‌పోయినా అలా చేయాల్సివ‌స్తుంద‌ని త‌న క్రూర‌త్వాన్ని శైలేంద్ర బ‌య‌ట‌పెడ‌తాడు. పిన్ని చ‌నిపోయిన త‌ర్వాత అయినా ఎండీ సీట్ త‌న‌కు ద‌క్కుతుంద‌ని అనుకున్నాన‌ని, కానీ నీ మొగుడు నిన్ను ఆ సీట్‌లో కూర్చొబెట్టాడ‌ని వ‌సుధార‌తో అంటాడు శైలేంద్ర . ఆ సీట్‌లో నుంచి త‌ప్పుకోమంటే నువ్వు విన‌లేదు. అందుకే ఇక వెయిట్ చేయ‌డం వేస్ట్ అని ఈ దారి ఎంచుకున్నాన‌ని వ‌సుధార‌ను భ‌య‌పెడ‌తాడు.

సీట్ అప్ప‌గిస్తేనే...

నా భ‌ర్త‌ను వ‌దిలిపెట్ట‌మ‌ని ఏడుపులు, బ‌తిమిలాడ‌టాలు చేయ‌కు. వాటి వ‌ల్ల నా మ‌న‌సు క‌ర‌గ‌దు. భ‌ర్త‌నా...ఎండీ సీటా అన్న‌ది బాగా ఆలోచించుకో. నాకు ఎండీ సీట్ అప్ప‌గిస్తేనే నీ భ‌ర్త ప్రాణాల‌తో తిరిగివ‌స్తాడు. లేదంటే అర్థం చేసుకోమ‌ని వ‌సుధార‌ను బెదిరిస్తాడు శైలేంద్ర‌. ఎండీ సీట్ ఎంత తొంద‌ర‌గా అప్ప‌గిస్తే అంత మంచిది నీకు అంటూ వ‌సుధార‌ను బ్లాక్‌మెయిల్ చేస్తాడు. శైలేంద్ర మాట‌ల‌తో వ‌సుధార క‌న్నీళ్ల‌తో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఎండీ సీట్ అప్ప‌గిస్తేనే రిషిని క్షేమంగా వ‌దిలిపెడ‌తాన‌ని శైలేంద్ర చెప్పిన మాట‌లే గుర్తుకొస్తుంటాయి.

రిషి అప్ప‌గించిన బాధ్య‌త‌...

రిషిని నిజంగా శైలేంద్ర కిడ్నాప్ చేశాడా? ఎండీ సీట్ అన్న‌ది రిషి అప్ప‌గించిన బాధ్య‌త‌. ఒక‌వేళ శైలేంద్ర చెప్పింది అబ‌ద్ధ‌మై రిషి తిరిగి వ‌స్తే అత‌డికి ఏమ‌ని స‌మాధానం చెప్పాలి. ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌క త‌ల్ల‌డిల్లిపోతుంది. ఆవేశంగా వెళ్లిన వ‌సుధార క‌న్నీళ్ల‌తో ఇంటికి తిరిగి రావ‌డం చూసి మ‌హేంద్ర‌, అనుప‌మ కంగారు ప‌డ‌తారు. ఏం జ‌రిగింద‌ని కోడ‌లిని అడుగుతాడు మ‌హేంద్ర‌.

ఎండీ సీట్ నాకు అక్క‌ర‌లేద‌ని, ఆ ప‌ద‌విలో తాను కొన‌సాగ‌న‌ని చెబుతుంది. ఎండీ ప‌ద‌విని వ‌దిలేస్తేనే రిషి సార్ ఎక్క‌డున్నాడో తెలుస్తుంద‌ని, ఆ ప‌ద‌వి వ‌ద్ద‌నుకుంటేనే రిషి క్షేమంగా తిరిగివ‌స్తాడ‌ని శైలేంద్ర త‌న‌ను బెదిరించిన సంగ‌తిని మ‌హేంద్ర‌, అనుప‌మ‌ల‌కు చెబుతుంది వ‌సుధార‌. శైలేంద్ర‌నే రిషిని కిడ్నాప్ చేశాడ‌ని తెలిసి మ‌హేంద్ర‌ ఆవేశానికి లోన‌వుతాడు.

ఎండీ ప‌ద‌వికి రాజీనామా...

నా భ‌ర్త రిషి క్షేమం కోసం ఎండీ సీట్‌కు రాజీనామా చేస్తాన‌ని వ‌సుధార అంటుంది. అది నీకు రిషి అప్ప‌గించిన బాధ్య‌త అని వ‌సుధార‌కు స‌ర్ధిచెప్ప‌బోతాడు మ‌హేంద్ర‌. నాకు ఎండీ ప‌ద‌వి అప్ప‌గిస్తూ నీ తెలివితేట‌లు, ప్ర‌తిభ‌తో కాలేజీని ఉన్న‌త స్థాయికి తీసుకెళ్లాల‌ని రిషి చెప్పిన మాట‌ల‌ను వ‌సుధార గుర్తుచేసుకుంటుంది.

రిషి నా ప‌క్క‌న లేకుండా ఏ ప‌ద‌వి ఉన్నా నాకు అది గ‌డ్డి ప‌ర‌క‌తో స‌మాన‌మ‌ని వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది. ఎండీ ప‌ద‌వికి రాజీనామా చేసినా కూడా రిషి ఆచూకీని శైలేంద్ర ఎలా చెబుతాడ‌ని అనుకుంటున్నావ‌ని, తొంద‌ర‌ప‌డి ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌ద్ద‌ని వ‌సుధార‌కు స‌ల‌హా ఇస్తుంది అనుప‌మ‌. రిషి ఎవ‌రి కంట్రోల్‌లో ఉన్నాడు తెలిసింది కాబ‌ట్టి అంద‌రం క‌లిసే ఈ స‌మ‌స్య‌ను సాల్వ్ చేద్ధామ‌ని అంటుంది. అంత టైమ్ లేదు. ఆల‌స్యం చేస్తే రిషి ప్రాణాల‌కు శైలేంద్ర ప్ర‌మాదం త‌ల‌పెట్టే అవ‌కాశం ఉంద‌ని వ‌సుధార భ‌య‌ప‌డుతుంది.

ధ‌ర‌ణి అబ‌ద్ధం...

భ‌ర్త శైలేంద్ర‌కు కాఫీ ఇచ్చి అత‌డి రూమ్ నుంచి ఆవేశంగా వెళ్లిపోబోతోంది ధ‌ర‌ణి. ఆమె తీరులో మార్పు రావ‌డం శైలేంద్ర క‌నిపెడ‌తాడు. నువ్వు న‌న్ను పాత శైలేంద్ర‌ను చూసిన‌ట్టే చూస్తున్నావ‌ని, ఏమైంద‌ని ధ‌ర‌ణిని అడుగ‌తాడు. నువ్వు న‌న్ను న‌మ్మాలంటే ఏం చేయాల‌ని ధ‌ర‌ణిని అడుగుతాడు.

ఏం చేయాల్సిన ప‌నిలేద‌ని సీరియ‌స్‌గా రూమ్ నుంచి వెళ్ల‌బోతుంది ధ‌ర‌ణి. ఆమెను ఆపుతాడు శైలేంద్ర‌. వ‌సుధారను ఎక్క‌డ క‌లిశావు, ఆమెకు ఏమైనా చెప్పావా అని ధ‌ర‌ణిని అడుగుతాడు శైలేంద్ర‌. ఇంట్లోనే వ‌సుధార త‌న‌ను క‌లిసింద‌ని, త‌ను న‌న్ను ఏం అడ‌గ‌లేద‌ని అబ‌ద్ధం ఆడుతుంది. భార్య మాట‌ల‌ను నిజ‌మ‌ని న‌మ్ముతాడు.

దేవ‌యాని ఆనందం...

ఆ త‌ర్వాత కొడుకు ద‌గ్గ‌ర‌కు దేవ‌యాని వ‌స్తుంది. వ‌సుధార ఎందుకు వ‌చ్చింద‌ని, నీతో ఏం మాట్లాడింద‌ని కొడుకును అడుగుతుంది. రిషి కోస‌మే వ‌చ్చింద‌ని చెబుతాడు. రిషిని తానే కిడ్నాప్ చేశాన‌ని, ఎండీ సీట్ త‌న‌కు అప్ప‌గిస్తేనే రిషిని వ‌దిలిపెడ‌తాన‌ని బెదిరించాన‌ని త‌ల్లితో చెబుతాడు శైలేంద్ర‌. ఎండీ సీట్ ఇవ్వ‌క‌పోతే రిషి ప్రాణాలు తీస్తాన‌ని ఖ‌రాఖండిగా చెప్పాన‌ని అంటుంది.

జ‌గ‌తి చావును వ‌సుధార క‌ళ్లారా చూసింది కాబ‌ట్టి నేను చెప్పిన‌ట్లు చేయ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో వ‌సుధార‌కు బాగా తెలుసున‌ని శైలేంద్ర అంటాడు. నువ్వు సూప‌ర్ నాన్న అంటూ కొడుకును మెచ్చుకుంటుంది దేవ‌యాని. వ‌సుధార‌కు రిషి అంటే ప్రాణం కాబ‌ట్టి అత‌డి కోస‌మైనా ఎండీ సీట్ నీకు అప్ప‌గిస్తుంద‌ని కొడుకుతో అంటుంది దేవ‌యాని. మ‌న క‌ల నెర‌వేర‌బోతుంద‌ని సంబ‌ర‌ప‌డుతుంది.

ఎండీ సీట్ ద‌క్కుతుంద‌ని చాలా సార్లు అనుకున్నామ‌ని, కానీ అలా జ‌ర‌గ‌లేద‌ని, ఈ సారి మాత్రం చేజారిపోద‌ని, డీబీఎస్‌టీ సామ్రాజ్యానికి అధినేత‌గా నీ కొడుకును నువ్వు చూడ‌బోతున్నావ‌ని త‌ల్లితో అంటాడు శైలేంద్ర‌. ఇద్ద‌రు సంబ‌రంలో మునుగుతారు.

వ‌సుధార క‌న్నీళ్లు...

రిషిని కాపాడుకోవ‌డం ఎలాగో తెలియ‌క జ‌గ‌తి ఫొటో ముందు క‌న్నీళ్లు పెట్టుకుంటుంది వ‌సుధార‌. ఎండీ ప‌ద‌విని వ‌దిలివేసి రిషిని కాపాడుకోవ‌డం త‌ప్ప త‌న‌కు మార్గ‌మేమి క‌నిపించ‌లేన‌ట్లుగా అనిపిస్తోంద‌ని ఎమోష‌న‌ల్ అవుతుంది. అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన అనుప‌మ...రిషిని కాపాడుకోలేక‌పోతే జ‌గ‌తి చేసిన త్యాగానికి అర్థం లేకుండాపోతుంద‌ని వ‌సుధార‌తో అంటుంది.

రిషి లేకుండా తాను బ‌త‌క‌లేన‌ని, అత‌డికి చిన్న ఆప‌ద వ‌చ్చిన త‌ట్టుకోలేన‌ని అనుప‌మకు బ‌దులిస్తుంది వ‌సుధార‌. జ‌గ‌తి... మ‌హేంద్ర మీద ఎంత ప్రేమ చూపించేందో నువ్వు కూడా రిషిపై అంత ప్రేమ చూపిస్తున్నావు. ఆ రోజు జ‌గ‌తి, మ‌హేంద్రల‌ ప్రేమ‌ను గెలిపించి వాళ్ల పెళ్లి జ‌రిపించాన‌ని, ఇప్పుడు రిషి ఎక్క‌డున్నాడో వెతికి మీ ఇద్ద‌రిని ఒక్క‌టి చేస్తాన‌ని వ‌సుధార‌కు మాటిస్తుంది అనుప‌మ‌. మ‌న భ‌యాన్ని శైలేంద్ర అలుసుగా తీసుకుంటున్నాడ‌ని, అత‌డికి త‌గిన బుద్ది చెప్పాల‌ని అంటుంది. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

టాపిక్

    Guppedantha ManasuStar Maa SerialsTelugu Tv SerialsDisney Plus Hotstar

    Guppedantha Manasu December 14th Episode: శైలేంద్ర చేతిలో బందీగా రిషి - భ‌ర్త కోసం త‌ల్ల‌డిల్లిన వ‌సు - దేవ‌యాని సంబ‌రం (2024)
    Top Articles
    Grab Knife V3 [FE] - Pastebin.com
    How To Teach Yourself Scripting on Roblox
    Public Opinion Obituaries Chambersburg Pa
    Cintas Pay Bill
    Bank Of America Appointments Near Me
    Mlifeinsider Okta
    Midway Antique Mall Consignor Access
    Craigslist Greenville Craigslist
    Johnston v. State, 2023 MT 20
    Robert Malone é o inventor da vacina mRNA e está certo sobre vacinação de crianças #boato
    OpenXR support for IL-2 and DCS for Windows Mixed Reality VR headsets
    Craigslist Pets Sac
    Busty Bruce Lee
    Lesson 8 Skills Practice Solve Two-Step Inequalities Answer Key
    Crossword Nexus Solver
    Soccer Zone Discount Code
    Best Uf Sororities
    Las 12 mejores subastas de carros en Los Ángeles, California - Gossip Vehiculos
    Craigslist In Visalia California
    Ibukunore
    Scotchlas Funeral Home Obituaries
    Grimes County Busted Newspaper
    Exl8000 Generator Battery
    Teekay Vop
    1773x / >
    Geico Car Insurance Review 2024
    What we lost when Craigslist shut down its personals section
    Healthy Kaiserpermanente Org Sign On
    Reserve A Room Ucla
    Ipcam Telegram Group
    Tripcheck Oregon Map
    Rush County Busted Newspaper
    Bad Business Private Server Commands
    Whas Golf Card
    About Us | SEIL
    Marie Peppers Chronic Care Management
    The Transformation Of Vanessa Ray From Childhood To Blue Bloods - Looper
    Topos De Bolos Engraçados
    Seminary.churchofjesuschrist.org
    062203010
    VPN Free - Betternet Unlimited VPN Proxy - Chrome Web Store
    Memberweb Bw
    Oklahoma City Farm & Garden Craigslist
    Ferhnvi
    Streameast Io Soccer
    This Doctor Was Vilified After Contracting Ebola. Now He Sees History Repeating Itself With Coronavirus
    Egg Inc Wiki
    Bismarck Mandan Mugshots
    Skyward Login Wylie Isd
    Rise Meadville Reviews
    Naughty Natt Farting
    Olay Holiday Gift Rebate.com
    Latest Posts
    Article information

    Author: Delena Feil

    Last Updated:

    Views: 6195

    Rating: 4.4 / 5 (45 voted)

    Reviews: 84% of readers found this page helpful

    Author information

    Name: Delena Feil

    Birthday: 1998-08-29

    Address: 747 Lubowitz Run, Sidmouth, HI 90646-5543

    Phone: +99513241752844

    Job: Design Supervisor

    Hobby: Digital arts, Lacemaking, Air sports, Running, Scouting, Shooting, Puzzles

    Introduction: My name is Delena Feil, I am a clean, splendid, calm, fancy, jolly, bright, faithful person who loves writing and wants to share my knowledge and understanding with you.